బీజేపీ కార్యకర్తలు ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మొన్నటివరకు గో సంరక్షణ పేరుతో దాడులు చేసిన బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు కాశ్మీరీ యువకులపై దాడులు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఎక్కువ ఉత్తరప్రదేశ్ లోనే జరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కాషాయ వస్త్రాలు వేసుకున్న ఇద్దరు బజరంగ్ దల్ కార్యకర్తలు లక్నోలో ఒక వ్యక్తిపై దాడికి దిగారు. అతడ్ని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. రోడ్డు పక్కన డ్రైఫ్రూట్స్ అమ్ముకుంటున్నఆ వ్యక్తిని కొట్టి ఆతడి వద్దనున్న సామాన్లు కూడా లాగేసుకున్నారు. ఇంతకూ అతను చేసిన తప్పేంటో తెలుసా.. కాశ్మీరీ యువకుడు అవ్వడమే.
పుల్వామా ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కాశ్మీరీ యువకుల్ని అనుమానంగా చూస్తున్నారు. దీంతో.. అడపాదడపా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. దాడి జరిగినప్పుడు చుట్టు పక్కల వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. వీడియో వైరల్ అవ్వడంతో యూపీ సర్కార్ విచారణకు ఆదేశించిది. దాడికి పాల్పడింది బజరంగ్ శంకర్‌గా గుర్తించారు. అతను ఒక రౌడీషీటర్. అతనిపై 12 క్రిమినల్ కేసులు - ఒక మర్డర్ కేసు ఉంది. ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సీరియస్ అయ్యారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Full View