మొన్న బుగ్గ‌న‌.. నేడు స‌జ్జ‌ల‌.. రాష్ట్ర అప్పుల‌పై క్లారిటీ!

Update: 2021-08-05 00:30 GMT
ఏపీ స‌ర్కారు చేస్తున్న అప్పుల విష‌యంలో అనేక విమ‌ర్శ‌లు, వాద‌న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా.. ప్ర‌తి నెలా వేల కోట్ల రూపాయ‌లు.. ప్ర‌జ‌ల(ల‌బ్ధిదారులు) ఖాతాల్లోకి మ‌ళ్లుతున్నాయి. దీంతో ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా పోతోంది. ఫ‌లితంగా ఖ‌జానాపై తీవ్ర భారం ప‌డుతోంది. ఎప్పటిక‌ప్పుడు.. అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి నుంచి ప్ర‌భుత్వం త‌ప్పించుకోలేక పోతోంది. అధిక వ‌డ్డీల‌కు కూడా అప్పులు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో అటు కేంద్రం నుంచి ఇటు ఆర్బీఐ నుంచి సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు ప్ర‌భుత్వానికి ష‌రా.. మామూలే అన్న‌ట్టుగా మారిపోయాయి.

ఈ ప‌రిణామాలపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో రాద్ధాంతం చేస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రం అప్పుల కుప్ప‌గామారిపోతోంద‌ని.. జ‌గ‌న్ రాష్ట్రాన్ని అప్పుల మ‌యం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఇక‌, ప్ర‌బుత్వ వ్య‌తిరేక మీడియా అయితే.. రోజుకో క‌థ‌నం వండివ‌డ్డిస్తోంది. దీంతో స‌ర్కారుకు.. అప్పుల ముప్పుక‌న్నా.. ఈ విమ‌ర్శ‌ల సెగ ఎక్కువ‌గా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈక్ర‌మంలో కొన్నిరోజుల కింద‌ట‌.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్పుల్లోనే ఉంద‌ని.. రాష్ట్రాలు ఇప్పుడున్న ప‌రిస్థితిలో అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని వివ‌రించారు.

అంతేకాదు, క‌రోనా స‌మ‌యంలో దెబ్బ‌తిన్న అన్ని రంగాల‌ను గాడిలో పెట్టేందుకు విస్తృతంగా నిధుల‌ను ప్ర‌జ‌లకుసంక్షేమం రూపంలో ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని కూడా మంత్రి వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఏయే రాష్ట్రాలు ఎన్నెన్ని అప్పులు చేశాయో కూడా బుగ్గ‌న వివ‌రించారు. ఇక‌, గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ చేసిన అప్పుల‌ను ఆయ‌న వివ‌రించారు. లోటు బ‌డ్జెట్ తో ప్రారంభ‌మైన ఏపీని.. మ‌రింత అప్పుల మ‌యం చేశారంటూ.. బుగ్గ‌న విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. కేంద్ర ప‌రిధిలోనే తాము అప్పులు చేస్తున్నామ‌న్న బుగ్గ‌న‌.. ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి పెరిగింద‌ని.. ఇత‌ర రాష్ట్రాల్లో కంటే.. క‌రోనా త‌ర్వాత‌.. ఏపీలో అనేక రంగాలు మెరుగ్గాయ‌ని వివ‌రించారు.

ఇక‌, తాజాగా.. ప్ర‌భుత్వ రాజ‌కీయ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా ఇదే విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యమవుతోందని  సజ్జల  తెలిపారు. కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని చెప్పారు. ``కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం రూ.30 వేల కోట్లు తగ్గింది. కరోనా  సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం రూ.30 వేల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఖర్చు చేశారు. మొత్తమ్మీద ప్రభుత్వంపై రూ.60 వేల కోట్ల భారం పడినా ప్రజలపై ఎలాంటి భారం వేసేలా ధరలు పెంచలేదు`` అని స‌జ్జ‌ల పేర్కొన్నారు.

అంతేకాదు..  విభజన సమయంలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ.90 వేల కోట్ల రుణాన్ని.. ఎడాపెడా అప్పులతో దోపిడీ చేసి దాన్ని రూ.3.60 లక్షల కోట్లకు పెంచేసి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని మండిప‌డ్డారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్‌ సర్కార్‌ను విమర్శించే నైతిక హక్కు, అర్హత చంద్రబాబుకు లేవని చెప్పారు.  మొత్తంగా చూస్తే.. ఏపీ అప్పుల విష‌యంలో ప్ర‌బుత్వం క్లారిటీగానేఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News