జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నది ఏపీ పాలిటిక్స్ లో దశాబ్దానికి పైగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే అది రాజకీయ క్షేత్రంలో మాత్రమే. మరో వైపు చూస్తే కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో చీలిన ఈ రాజకీయంలో మీడియా సహా కొన్ని రంగాలు కూడా వచ్చాయి. కానీ టోటల్ గా సమాజం రెండుగా చీలిపోయింది అంటే ఆ లాజిక్ ఎవరికీ అర్ధం కానిదే. ఏపీలో సీఎం గా జగన్ ఉన్నారు. ఆయన పాలన బాగులేదు అన్న వారు అంతా బాబు మనుషులో మద్దతుదారులో అయి ఉండరు కదా.
కానీ ఇదే రకమైన వాదనను వైసీపీ నేతలు ఎప్పటికపుడు సరికొత్తగా మార్చి వినిపిస్తూ ఉంటారని అంటున్నారు. ఇక అవన్నీ ఎలా ఉన్నా వైఎస్సార్ కుటుంబం ఎపుడూ యాంటీ టీడీపీగానే ఉంది. ఆ ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నా ఎవరూ టీడీపీకి కనీసం సమీపంలో కూడా లేరు. ఏ రోజూ సన్నిహితంగా కూడా లేరు.
అయితే జగన్ మీద నోరు విప్పే సొంత మనుషులను కూడా ఎప్పటి మాదిరిగానే రొడ్డ కొట్టుడు పాలిటిక్స్ చట్రాన తెచ్చి చంద్రబాబు సపోర్టర్లుగా మార్చేస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య మానవత్వం ఉన్న వారందరినీ కలత పెట్టించేదే. పైగా ఆయన సాధు స్వభావి, అజాత శతృవు అని పేరు ఉన్న వారు. ఈ సంగతి ఇలా ఉంటే అందరి కంటే ఎక్కువ బాధ సొంత రక్తం పంచుకుని పుట్టిన కుమార్తెకు ఉంటుంది అన్నదాంట్లో ఎవరూ విభేదించరు కదా.
అలా వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారి విషయంలో అసలు దోషులు తేలాలీ అని మూడేళ్ళుగా అలుపెరగక పోరాడుతున్నారు. ఆ విషయంలో ఆమె పోరాటం ఫలితంగానే సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆమె కానీ ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కానీ ఇచ్చిన వాంగ్మూలాలు ఏపీ రాజకీయాలను పెద్ద ఎత్తున షేక్ చేస్తున్నాయి.
అవి అటూ ఇటూ తిరిగి ఏకంగా జగన్ మీదనే వేళ్లు పెట్టి చూపేలా ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ తో సహా సగటు ప్రజానీకం షాక్ తినే లాగానే ఈ వాంగ్మూలాలు ఉన్నాయన్నది నిజం. అయితే దీని మీద అసలు నిజాలు చెప్పాల్సింది సీబీఐ. ఆ దర్యాప్తు అలా ఉండగానే వైసీపీ నుంచి కూడా వేడి వేడిగా కౌంటర్లు పడుతున్నాయి.
లేటెస్ట్ గా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమెతో పాటు భర్త రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ మీద జరుగుతున్న కుట్రలో భాగమవుతున్నారని అన్నారు. ఇదంతా మూడేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆయన ఘాటుగానే అంటున్నారు.
సరే సునీత కానీ ఆమె భర్త కానీ ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని విస్మయపరచే విమర్శలు ఉంటే ఉండవచ్చు కానీ వైఎస్సార్ కుటుంబం అంటేనే యాంటీ టీడీపీ కదా. మరి ఆ ఫ్యామిలీ నుంచి రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని సునీత ఆమె భర్త టీడీపీ వైపుగా వచ్చారూ అంటేనే ఇది ఆశ్చర్యకరమైన విమర్శగా చూడాలి.
రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనుకున్నా కానీ ఒక బాధితురాలుగా, వివేకాను హత్యతో అందరి కంటే ఎక్కువగా నష్టపోయిన వ్యక్తిగా సునీతను చూడాలిక్కడ. ఆమె పోరాటం వెనక ఉన్న ఆరాటం కూడా అర్ధవంతమైనదే అని కూడా అనాలి ఇక్కడ.
తన తండ్రిని చంపిన వారిని కటకటాల పాలు చేయాలన్న సునీత తపనను సగటు ప్రజానీకం సరిగ్గానే అర్ధం చేసుకుంటోంది. కానీ ఇక్కడ రాజకీయాలు తెచ్చి ఆమె చంద్రబాబు మనిషి అని ఆయన చేతిలో పావు అని వైసీపీ నుంచి విమర్శలు రావడమే తర్కానికి అందకుండా ఉందని అంటున్నారు. జగన్ని విమర్శించే వారు అంతా చంద్రబాబు మనుషులే అంటే ఒక విధంగా వైసీపీ బాబు ఫోబియా తో ఈ రోజుకీ ఉందనే అంటున్నారు మరి.