రాజు తలచుకుంటే వరాలకు కొదవా అని అంటారు. అలాంటి రాజు మన్నన పొందిన వారికి పదవులు కొదవా. ఇప్పటికే జగన్ కి తలలో నాలుకగా ఉంటూ ఒక విధంగా జగన్ అధికార ప్రతినిధిగా, సకల శాఖల మంత్రిగా పేరు గడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డికి జగన్ మార్క్ సర్ ప్రైజ్ త్వరలో ఇస్తారని తెలుస్తోంది. జగన్ ఏం చెబుతారు అన్నది అందరి ఆలోచన అయితే సజ్జల చెప్పేశాక అది జగన్ మాటే అని అనుకోవాల్సి వస్తుంది.
అలా జగనే తాను అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న సజ్జల సేవలకు జగన్ బాగా ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. దాంతో త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో సజ్జల రామక్రిష్ణారెడ్డిని మంత్రిగా తీసుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
ఇప్పటిదాకా సజ్జల మీద అనేక విమర్శలు విపక్షాలు చేశాయి. ఈ మధ్యనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్యాబినేట్ లో ఆయనకు ఉన్న హోదా ఏంటి, ఆయనతో చర్చలు జరపడమేంటి అని కూడా అన్నారు. ఇంకో వైపు సకల శాఖలను చూసే మంత్రి గారు అని విపక్షాలు తరచూ ఎద్దేవా చేస్తూంటాయి. అన్ని అయనే చెపేడమేమిటి అని గుస్సా అవుతాయి కూడా.
మరి వారందరి కోరికను నిజంగా తీర్చేయాలని జగన్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇపుడు సజ్జలను మంత్రిగా చేయబోతున్నారుట. సజ్జలను త్వరలో జరగనున్న విస్తరణలో మంత్రిగా చేసి క్యాబినేట్లో కీలకం చేస్తారని చెబుతున్నారు.అయితే వైసీపీలో దీనికి ముందు ఒక మాట వినిపించింది. సజ్జలను రాజ్యసభకు పంపుతారని, నిజానికి సజ్జల పెద్దల సభకు వెళ్లాలని అనుకున్నారు. అయితే ఎంపీ సీట్ల విషయంలో కొత్త సమీకరణలు చేస్తున్నారుట.
ఇక సజ్జలను ఢిల్లీకి పంపే యోచన జగన్ కి లేదని చెబుతున్నారు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుని మరింత కీలకం చేయాలన్నదే జగన్ ఆలోచన అంటున్నారు. మొత్తానికి సకల శాఖల మంత్రి ఇక మీదట నిజంగానే మంత్రి కాబోతున్నారుట. మరి ఆ రోజు ఎంతో దూరం కూడా లేదని అంటున్నారంటే సజ్జల వారు చాన్స్ కొట్టేసినట్లే.