రాజకీయాల్లో నిజాలు నిర్ధరణలు పెద్దగా ఉండవు. ఎందుకు అంటే అక్కడ కేవలం ఆరోపణలు మాత్రమే ఉంటాయి. వాటిని చూపించి జనంలో ప్రచారంలో పెట్టి లబ్ది పొందే ప్రయత్నమే ఉంటుంది. ఇక ఓటుకు నోటు కేసు అన్నది నాడు వైసీపీ అస్త్రంగా మార్చుకుంది. బాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆ కేసు ప్రచారం ఎంతవరకూ ఉపయోగపడిందో తెలియదు కానీ బాబుతో సహా తమ్ముళ్ల గొంతుని కాస్తా తగ్గించడానికి మాత్రం ఎప్పటికపుడు ఓటుకు నోటు కేసు అలా తెర మీదకు వస్తూనే ఉంటుంది.
సరిగ్గా ఇపుడు వైసీపీకి అవసరం పడింది. మరోసారి ఓటుకు నోటు కేసుని వైసీపీ నేతలు తలచుకున్నారు. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు విషయం మీద టీడీపీ రాద్ధాంతం చేయడాన్ని తప్పు పట్టారు. అది నాలుగు గోడల మధ్య జరిగిన ఒక వ్యవహారంలా కనిపిస్తోంది. పైగా ఒరిజినల్ వీడియోగా కూడా అగుపించడంలేదు అని ఆయన చెబుతున్నారు.
ఇక అవతల పక్కన ఎవరు ఉన్నారో కూడా తెలియదు. అయితే గోరంట్ల ఎంపీ కాబట్టి ప్రజా ప్రతినిధి కాబట్టే దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు అని సజ్జల తనదైన వాదన వినిపించారు. ఇక గోరంట్లది అని చెప్పబడుతున్న న్యూడ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళిందని, అక్కడ ఫేక్ దా లేక నిజమైనదా అన్న నివేదిక వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని కోసం తొందర ఎందుకు అని ఆయన మీడియా ముఖంగా టీడీపీని ప్రశ్నించారు.
ఆ మాటకు వస్తే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో 2015లో అడ్డంగా దొరికిపోయారని, ఈ రోజు వరకూ ఆ వాయిస్ తనది కాదని ఎక్కడా ఆయన చెప్పలేదని కూడా సజ్జల గుర్తు చేశారు. మరో వైపు చూస్తే వీడియోలో ఆనాటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. నోటుకు ఓటుని కొనే ఒప్పందంలో భాగంగా ఓ ఎమ్మెల్యేకు నగదు కూడా ఆఫర్ చేసినట్లుగా అక్కడ కనిపిస్తోంది. బ్రీఫ్డ్ మీ అంటూ బాబు తనదైన స్టైల్ లో మాట్లాడుతున్న ఆడియో ఉందని సజ్జల చెప్పుకొచారు.
దేశానికి రాజ్యాంగానికి ఎన్నికల సంఘానికి ప్రజాస్వామ్యానికి సవాల్ చేసేలా నాటి ఓటుకి నోటు కేసు ఉంటే ఇప్పటిదాకా దాని మీద టీడీపీ వాళ్లు ఏమైనా వివరణ ఇచ్చారా అని సజ్జల ఎదురుదాడి చేశారు. అలాగే గోరంట్ల ఓ సాధారణ లోక్ సభ సభ్యుడు. మరి బాబు అలా కాదు కదా, ఆయన ఆనాడు ఏపీకి చీఫ్ మినిష్టర్ గా ఉన్నారు, అలాగే టీడీపీకి అధ్యక్షుడు. మరి బాబు చేసిన ఏ పని మీద ఎవరూ ఇప్పటిదాకా పెద్దగా మాట్లాడరేమి అని కూడా సజ్జల తమ్ముళ్ళను నిలదీశారు.
అలాగే, గోరంట్ల వీడియో తరువాత కానీ ముందు బాబు ఓటుకు నోటు కేసు వీడియో సంగతేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోరంట్ల వీడియోలో తప్పు ఆయనది అని తేలితే తప్పక శిక్ష ఉంటుందని చెబుతూనే ఓటుకు నోటు కేసుని మరోసారి తవ్వి తీసే ప్రయత్నం అయితే సజ్జల చేశారు. ఒకటి రెండూ కాదు ఏకంగా ఏడేళ్లు గడిచినా ఈ వీడియో మీద అందులోని బాబుదే అన్న గొంతు మీద టీడీపీ నేతలు ఎందుకు వాస్తవాలను రుజువు చేయలేదని సజ్జల సూటిగానే ప్రశ్నించారు.
మొత్తానికి గోరంట్ల న్యూడ్ వీడియో కేసు విషయానిది ఏముందిలే కానీ బాబుదే చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా సజ్జల మాట్లాడడంతో టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. గోరంట్లకు క్లీన్ చీట్ ఇవ్వడానికే ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి సజ్జల మాటల ద్వారా ఇపుడు తేలినది, తెలిసింది ఏమిటి అంటే గోరంట్ల వీడియో వర్సెస్ బాబు ఓటుకు నోటు ఆడియో అని. ఈ రెండింటికి మధ్య పోలిక తెచ్చి అసలు వ్యవహాఅన్ని టీడీపీ కోర్టులోనే పడేయాలన్న ప్రయత్నం అయితే చేశారుఅని. మరి ఇది అంత తొందరగా ఆరిపోయే చిచ్చా అంటే జవాబు మాత్రం లేదు అనే చెప్పాలి.