పాకిస్థాన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వెళ్లారు? ప్రధాని స్థాయి వ్యక్తి ప్లేబాయ్ టైపులో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? లాంటి ప్రశ్నలు పలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మోడీ పాక్ పర్యటన వెనుక పారిశ్రామిక పెద్దల హస్తం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అద్యంతం నాటకీయంగా సాగిన మోడీ పాక్ పర్యటనకు సంబంధించి ఒక కోణాన్ని మాత్రమే మీడియా చూపిస్తే.. మరో కోణాన్ని కొద్దిమంది మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పాకిస్థాన్ కు వెళ్లాలన్న హటాత్తు నిర్ణయం వెనుక కొందరి వ్యక్తుల హస్తం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
వారి వాదనకు తగ్గట్లే కొన్ని ఆధారాల్ని చూపిస్తుండటం విశేషం. ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు గురించి తెలిసిన మోడీకి.. ఆయన మనమరాలు పెళ్లి జరుగుతుందన్న విషయం తెలీకపోవటం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. జానే జిగిరి దోస్తానా అన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరి స్నేహ బంధం మరీ అంత బలమైనదే అయితే.. నవాజ్ ఇంట జరుగుతున్న మనమరాలి పెళ్లికి మోడీని ఆహ్వానించలేదా? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ ఆహ్వానం అందని పక్షంతో తన వెంటనే.. నవాజ్ మనమరాలి (షరీఫ్ కుమార్తె కుమార్తె) పెళ్లికి ‘పెళ్లికూతురు దుస్తుల కానుక’ ఎలా తీసుకెళ్లారు? పాక్ ప్రయాణం హటాత్తుగా తీసుకున్నదే అయితే.. ఇలాంటి ముందస్తు ఏర్పాట్లు ఎలా జరిగినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే..మోడీ.. నవాజ్ షరీప్ ల మీటింగ్ లో వ్యాపార వర్గాల పాత్ర చాలా ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. పాక్ ప్రధాని నవాజ్ షరీప్ కుటుంబానికి గల్ప్ దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారాల్లో ఉక్కు పరిశ్రమలున్నాయి. వీటిలో జిందాల్ గ్రూప్ నకు చెందిన సజ్జన్ జిందాల్ కు పాక్ ప్రధాని నవాజ్ కుమారుడు హుసేన్ షరీఫ్ లకు మధ్య వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. తరచూ వీరి మధ్య మీటింగ్స్ సాగుతుంటాయని.. ఇవి ఏ స్థాయిలో ఉంటాయంటే.. మోడీ ప్రమాణస్వీకార మహోత్సవానికి భారత్ కు వచ్చిన నవాజ్ షరీఫ్.. సజ్జన్ జిందాల్ ఇంటికి టీకి వెళ్లటమేనని చెబుతారు.
ఇక.. ప్రధాని మోడీ లాహోర్ పర్యటన సమయంలో నవాజ్ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడే సజ్జన్ జిందాల్ ఉండటం గమనార్హం. అంతేకాదు.. సార్క్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఖాట్మాండులో ఇద్దరు ప్రధానుల మధ్య కీలక భేటీకి సజ్జన్ జిందాల్ పాత్ర ఉందని చెబుతారు. ఏమైనా.. మోడీ పాక్ పర్యటన వెనుక కొందరి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయా? అన్న సందేహాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.