సల్మాన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అంతేకాదు, హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను కూడా హైకోర్టు నిలుపుదల చేస్తూ శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఆల్కహాల్ ఉంటే ఇది శిక్షార్హమైన హత్య అవుతుందని చెప్పే చట్టాలేవీ భారతీయ శిక్షాస్మృతిలో లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రూ. 30 వేల పూచీ కత్తును ట్రైల్ కోర్టుకు సమర్పించాలని కోరింది. రేపటి నుంచి జూన్ 15 వరకూ కోర్టు సెలవులు కావడంతో... ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కూడా జూన్ ద్వితాయర్థం లేదా జులైలో ఉండొచ్చని భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన పాస్ పోర్టును కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయకూడదని కూడా నిర్దేశించింది.
సల్మాన్ కు బెయిల్ లభించడంతో అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు! బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణసంస్థలు కూడా సల్మాన్ బెయిల్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశాయి. ఎందుకంటే, ఇప్పటికే సల్మాన్ తో కాంట్రాక్ట్ లు కుదుర్చుకుని, షూటింగులు సగం జరిగిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ బెయిల్ పుణ్యమా అని కొన్ని ప్రాజెక్టులు అయినా వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని సల్మాన్ సన్నిహితులు చెబుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయమై సల్మాన్ కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని, ప్రాధాన్యతా క్రమంలో షూటింగులను వీలైనంత వేగంగా ముగిస్తారని కూడా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్ షెడ్యూల్స్ ని ఇండియాలోనే వివిద లొకేషన్లకు మార్చనున్నారు!