స‌ల్మాన్ జ‌డ్జి ఆక‌స్మిక బ‌దిలీ.. ఏం జ‌ర‌గ‌నుంది?

Update: 2018-04-07 05:00 GMT
దాదాపు 20 ఏళ్ల కింద‌ట కృష్ణ జింక‌ల్ని వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ప‌డిన బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. తన‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ స‌ల్మాన్ దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగినా.. ఆదేశాల జారీకి ఆలస్య‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఊహించ‌నిరీతిలో స‌ల్మాన్ కేసును విచారిస్తున్న జోథ్ పూర్ సెష‌న్స్ కోర్టు జ‌డ్జి ర‌వీంద్ర‌కుమార్ జోషి ఆక‌స్మికంగా బ‌దిలీ అయ్యారు. ఆయ‌న‌తో పాటు రాజ‌స్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా 87 మంది జిల్లా జ‌డ్జిల‌ను రాజ‌స్థాన్ హైకోర్టు ఆక‌స్మికంగా బదిలీ చేసింది. ఈ ప్ర‌భావం స‌ల్మాన్ మీద ప‌డ‌నుంది.

ఎందుకంటే.. బ‌దిలీ అయిన జ‌డ్జి కేసును విచారించ‌లేరు. ఇప్ప‌టికే బెయిల్ పిటిష‌న్ ను విచారించి.. తీర్పును రిజ‌ర్వ్ చేశారు. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా బ‌దిలీ మీద వ‌చ్చిన జ‌డ్జి విదులు స్వీక‌రించిన త‌ర్వాతే ఈ కేసును విచారించ వీలుంది. ముందుగా అనుకున్న ప్ర‌కారం శుక్ర‌వారమే స‌ల్మాన్ విడుద‌ల అవుతార‌ని భావించినా.. జ‌డ్జి నిర్ణ‌యంతో అది సాధ్యం కాలేదు. తాజాగా జ‌రిగిన ఆక‌స్మిక బ‌దిలీల కార‌ణంగా పిటిష‌న్ విచార‌ణ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది ఈ కార‌ణంగా స‌ల్మాన్ మ‌రిన్ని రోజులు జోథ్ పూర్ జైల్లో గ‌డ‌పాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే జైల్లో ఉన్న స‌ల్మాన్ రెండో రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఏమీ తిన‌లేద‌ని చెబుతున్నారు. ఆశారాం బాపూ ఇచ్చిన ఆహారాన్ని కాస్త తిన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా.. అలాంటిదేమీ లేద‌ని.. గురువారం రాత్రి ఏమీ తిన‌కుండా నిద్ర‌పోయిన‌ట్లు చెబుతున్నారు. శుక్ర‌వారం ఉద‌యం కూడా ఏమీ తిన‌లేద‌ని.. మ‌ధ్యాహ్నం మాత్రం భోజ‌నం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌ప్పు.. కూర‌గాయ‌లు..చ‌పాతీల‌తో కూడిన భోజ‌నాన్ని ఆయ‌న తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఖైదీ దుస్తులు ఇంకా రెఢీ కాక‌పోవ‌టంతో స‌ల్మాన్ త‌న సొంత బ‌ట్ట‌ల్నే ధ‌రించారు.

జైలు అధికారుల్ని అడిగి శుక్ర‌వారం ఉద‌యం హిందీ దిన‌ప‌త్రిక‌ల్ని స‌ల్మాన్ చ‌దివార‌ని.. త‌న న్యాయ‌వాదులు.. అంగ‌ర‌క్ష‌కుల్ని క‌లిశారు. బాలీవుడ్ న‌టి ప్రీతీ జింటాతో పాటు ఆయ‌న సోద‌రీమ‌ణుల్ని స‌ల్మాన్ క‌లిశారు.
Tags:    

Similar News