కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు - రూ.50 వేలకు మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించిన తర్వాత సల్మాన్ బెయిల్ పై విడుదలయ్యారు. అంతే కాకుండా, తమ అనుమతి లేకుండా విదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విదేశాలకు వెళ్లేందుకు కచ్చితంగా కోర్టు అనుమతి నిబంధనను నుంచి విముక్తి కల్పించాలని సల్మాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో నేడు ఆ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. సల్లూ భాయ్ పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది. తమ అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లే అవకాశమే లేదని మరోమారు స్పష్టం చేసింది. దీంతో, సల్మాన్ కు కోర్టులో చుక్కెదురైనట్లయింది.
ప్రస్తుతం సల్లూ భాయ్ `భరత్ `చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 10 నుంచి 26 తేదీల మధ్య ఈ చిత్ర షూటింగ్ కోసం విదేశాల్లో పర్యటించాల్సి ఉంది. దీంతో, షూటింగ్ కోసం అబుదాబి - మాల్టాలలో సల్మాన్ పర్యటించాల్సి ఉంటుందని అతడి లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే, తమ అనుమతి తీసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లాలని జోధ్ పూర్ కోర్టు ...సల్మాన్ లాయర్ కు స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా సల్మాన్ ను రాజస్థాన్ జోధ్ పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేముందు కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని, ఆ నిబంధన నుంచి విముక్తి కల్పించడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో, ప్రతి సారి కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాలనుకున్న సల్మాన్ ఆశలు ఆవిరయ్యాయి.