ఉప్పు-నిప్పు: కేసీఆర్, గవర్నర్ కలిశారు

Update: 2020-08-30 10:50 GMT
తెలంగాణ ప్రభుత్వం కరోనా చికిత్సల విషయంలో అవలంభిస్తున్న నిర్లక్ష్యంపై ఇటీవల గవర్నర్ తమిళసై జాతీయ మీడియా ముందు కడిగిపారేసి పరువు తీసింది. ఆ బాధ, ఆవేదన టీఆర్ఎస్ నేతల్లో ఉన్నా బయటకు అనలేని పరిస్థితి.కేసీఆర్ కూడా గుంభనంగానే వ్యవహరించారు. కేసీఆర్ తీర్మానించే బిల్లులన్నీ గవర్నర్ వద్దకే వస్తాయి కాబట్టి నేతలను కంట్రోల్ చేసి తనూ కంట్రోల్ గానే ఉన్నారు.

అయితే ఇప్పుడు కరోనా చికిత్సల విషయంలో గవర్నర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ సర్కార్ కు.. గవర్నర్ కు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగానే ఉంది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా కేసీఆర్ గవర్నర్ ను కలవడానికి కారణం కారణంగా తమిళ సై బాబాయి.. కన్యాకుమారి ఎంపీ వసంత్ కుమార్ మృతి చెందడంతో సంతాపం తెలుపడానికే కేసీఆర్ వచ్చారు. రాజ్ భవన్ వచ్చి సంతాపం తెలిపిన కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ తో వసంతకుమార్ చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందని కేసీఆర్ గవర్నర్ తో అన్నట్టు తెలిసింది.

కాగా ఈ సానుభూతి పర్యటనతో నైనా కేసీఆర్ సర్కార్ మీద గవర్నర్ తమిళి సైకి కోపం తగ్గుతుంది కావచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News