ఆ దేశ ప్రజలు సిగ్గుపడేలా చేసిన దేశాధ్యక్షుడు

Update: 2019-09-28 08:19 GMT
సెల్ఫీ పిచ్చతో ప్రాణాలు తీసుకున్నోళ్లు ఎందరో. సెల్ఫీ మీద ఉన్న మోజుతో వివాదాల్లోకి చిక్కుకునే వారు.. అనవసరమై ఇబ్బందుల్లో పడే వారు చాలామందే ఉన్నారు. అయితే.. వీరంతా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ కనిపిస్తారు. తొలిసారి ఒక దేశాధ్యక్షుడికున్న సెల్ఫీ పిచ్చ అంతర్జాతీయంగా ఆ దేశాన్ని అభాసుపాలు అయ్యేలా చేసిన వైనం చోటు చేసుకుంది.

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు దేశాధ్యక్షులకు అవకాశం ఇవ్వటం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుక్లే  ప్రసంగించటానికి వేదిక మీదకు వచ్చాడు. రావటంతోనే ఆయన అనూహ్యంగా వ్యవహరించారు. ప్రసంగం ప్రారంభించటానికి ముందు వేదిక పై నుంచి ఒక సెల్ఫీని తీసుకోనివ్వండంటూ దేశాధ్యక్ష హోదాలో ఉన్న ఆయన నోటి నుంచి వచ్చిన మాటతో అవాక్కుఅయ్యారు.

దేశాధినేతలు.. మంత్రులు.. అత్యున్నత స్థాయి అధికార గణం సమక్షంలో ఆయన వింత చేష్టతో ఆ దేశం అభాసుపాలైంది. మీరు ఒక్క సెకన్ ఓపిక పట్టండి..అంటూ తన జేబులోని సెల్ ఫోన్ ను బయటకు తీసి.. ఒక సెల్ఫీని క్లిక్ మనిపించారు. తన సోషల్ మీడియా ఖాతాలో లక్షలాది ఫాలోవర్లు ఉన్నారని.. తాను చేసే ప్రసంగం కంటే సోషల్ మీడియాలో తనను ఎక్కువమంది చూస్తారంటూ ఆయన మాటలు.. అక్కడున్న వారిని విస్తుపోయేలా చేసింది. దేశాధ్యక్షుల వారు చేసిన పనికి ఎల్ సాల్వడార్ ప్రజలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.


Tags:    

Similar News