ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో.. అక్కడి దీపావళి మార్కెట్లో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా తయారు చేసిన సమాజ్ వాదీ పార్టీ రాకెట్లు - మయావతి బాంబులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల పేరుతో వివిధ రకాల టపాసులు తయారు చేశారు. సమాజ్ వాదీ రాకెట్స్ పేరుతో తయారు చేసిన టపాసుల ప్యాకెట్లపై ఆ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఫోటో ముద్రించబడి ఉంది. కొన్ని ప్యాకెట్లపై అమర్ సింగ్ కు ములాయం స్వీట్లు తినిపిస్తున్నట్లుగానూ ముద్రించారు. అదే కోవలో ప్రతిపక్ష పార్టీ బీఎస్పీ పేరుతోనూ టపాసులు మార్కెట్లో ఉన్నాయి. వీటిపై బీఎస్పీ అధినేత్రి మయావతి పోటోను ముద్రించారు. ఫోటో కింద 'యాంగ్రీ బాంబ్' అని రాసారు.
ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేరుతోనూ టపాసులను రూపొందించారు. అఖిలేష్ 10000 క్రాకర్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. యువతలో మంచి అభిమానులు ఉన్న అఖిలేష్ పేరుతో తయారు చేసిన బాణాసంచా వస్తువులకు డిమాండ్ బాగా ఉన్నట్లు వ్యాపారస్తులు అంటున్నారు. '2017లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడిగా ఉండటం అంశాలను దృష్టిలో పెట్టుకుని వీటిని తయారు చేశాం' అని వ్యాపారులు చెప్తున్నారు. ఈ టపాసులను యువకులు, రాజకీయ నాయకులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంశంతో పాటు, ప్రస్తుతం ములాయం కుటుంబంలో సాగుతున్న వివాదం కూడా ఈ టపాసులపై ఆసక్తిని మరింతంగా పెంచుతుంది. ములాయం కుటుంబంలో వివాదం కొనసాగుతుండటంతో ఈ సారి కుటుంబమంతా కలిసి దీపావళి పండుగను జరుపుకుంటారా లేదా అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. వివాహాం - నిశ్చితార్థం వంటి కుటుంబ వేడుకలతో పాటు - హోళీ - దీపావళి వంటి పండుగలను తమ స్వగ్రామం సైఫైలో ములాయం కుటుంబం నిర్వహించుకుంటుంది. ఈత్వార్ జిల్లాలోని సైఫైలో ఇప్పటి వరకూ ములాయం కుటుంబం ఎలాంటి వేడుకను కోల్పోలేదు. మరి ఈ దీపావళికి ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/