మేథావుల‌కు సామ్..కంగ‌న దివాళీ పంచ్!

Update: 2021-11-04 08:00 GMT
దీపావ‌ళి అంటేనే  ప‌టాసుల పండ‌గ‌. ఒక్క‌రోజు రాత్రి అంతా ప‌టాసుల‌తో ధూమ్ ధామ్ లాండించాల్సిన పండుగ‌. పెద్ద‌ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పిల్ల‌ల‌కు మాత్రం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. వారం రోజుల ముందుగానే పండుగ  వ‌చ్చినంత సంతోషిస్తారు. ఇక పండుగ ఒక్క రోజు రాత్రి అయితే వాళ్ల ఆనందానికి అవ‌ధులుండ‌వ్. స‌రిగ్గా ఇదే పాయింట్ వాడుకుని స‌మంత‌.. కంగ‌నా ర‌నౌత్ ట‌పాసులు కాల్చొద్దు! అన్న వాళ్లంద‌రికి పంచ్ ల మీద పంచ్ లేసి నోళ్లు మూయించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది మేథావులు ఎవ‌రూ ట‌పాసులు కాల్చి దేశాన్ని కాలుష్య‌మ‌యం చేయ‌కండి అంటూ పిలుపునిచ్చారు.

కొంత మంది అయితే  బాణా సంచాను నిషేధించాల‌ని నిన‌దించారు. ఇందులో ముంబై మేయ‌ర్ కిషోరి ప‌డ్నేక‌ర్..బాలీవుడ్ నిర్మాత రియా క‌పూర్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు..సామాజిక వేత్త‌లు ఉన్నారు. క్రాక‌ర్స్ కాల్చ‌డం పాత ప‌ద్ద‌త‌ని కొంద‌రంటే..వీటి వ‌ల్ల డ‌బ్బు వృద్ధా అని ఇంకొంద‌రు..మరికొంద‌రైతే పెద్ద పెద్ద  ప్లైక్సీలు వేసి మ‌రీ ప్ర‌చారం చేసారు.  దీంతో కంగ‌న వాళ్లంద‌రిపై అంతెత్తున  లేచి ప‌డింది. క్రాకర్స్ కాల్చొద్ద‌ని ఉచిత స‌ల‌హాలు ఇస్తోన్న మేథావుల్లారా మీరంతా ఓ మూడు రోజుల పాటు కార్ల‌లో తిర‌గ‌డం  మానేయండి. కనీసం ఈ మూడు రోజులైన కాలుష్య ర‌హిత న‌గ‌రాల్ని చూడొచ్చు.

కాలుష్యం ఎంతో త‌గ్గుతుంది. ప్లైక్సీ వేసిన ఖ‌ర్చుతో కొంత మంది ఆక‌లి తీర్చొచ్చు. ఉచిత స‌ల‌హాలు..సూచ‌న‌లు ఎన్నైనా ఇవ్వొ్చు. వాటిని పాటించి చూస్తే అస‌లేంటి? అన్న‌ది  తెలుస్తుంది. ఒక్క రోజు పిల్ల‌లు ట‌పాసులు కాలిస్తే వాళ్ల‌కి ఎంతో ఆనందం. కోట్ల రూపాయ‌లు ఇచ్చినా తీర‌ని ఆనందం వాళ్ల‌కి ద‌క్కుతోంది.  అలా ఒక్క రోజు చేయ‌డం వ‌ల్ల న‌గ‌రం కాలుష్య‌మ‌యం అయిపోదని కంగ‌న వ్యాఖ్యానించింది. ఇక స‌మంత బాణా సంచా నిషేదం వ‌ద్దంటూ స‌ద్గురు జ‌గ్గీ వాస్ దేవ్ చేసిన పోస్ట్ ను షేర్ చేసింది. దీపావ‌ళి కోసం పిల్ల‌లు ఎన్నో క‌ల‌లు కంటారు. పెద్ద‌లు కాల్చ‌డం మానేసి పిల్ల‌ల‌కి ఆ అవ‌కాశం క‌ల్పించండ‌ని స‌మంత ఉద్దేశాన్ని చెప్పింది. మ‌రి మేధా వ‌ర్గం ఎలా స్పందిస్తుందో చూద్దాం.
Tags:    

Similar News