రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకు వస్తే దేశంలోని చాలా మీడియా సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. మరో రోజు వ్యవధిలో హైదరాబాద్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక గురించి బోలెడంత న్యూస్ ను కవర్ చేస్తున్నాయి.
దీంతో.. ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ముచ్చటే ఒకటి బయటకు వచ్చింది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అతిథిగా వస్తున్న ట్రంప్ కూతురికి గిఫ్ట్ గా ఇవ్వటానికి కొన్ని చీరల్ని ఎంపిక చేశారు. వీటిని ప్రముఖ సినీనటి సమంత సెలెక్ట్ చేయటం విశేషం.
సిద్దిపేటలో తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరల్ని ఇవాంకకు ఇవ్వటానికి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ట్రంప్ కుమార్తెకు ఇచ్చే పలు బహుమతుల్లో చీరలు కొన్నింటిని బహుమతిగా ఇస్తారని చెబుతున్నారు. ఈ బహుమతుల జాబితాలో గొల్లభామ చీరను చేర్చినట్లుగా తెలుస్తోంది. 50 ఏళ్లుగా సిద్ధిపేటలలో ఈ తరహా చీరల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత.. ఈ చీరలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. సిద్దిపేటకు స్వయంగా వెళ్లి మరీ.. గొల్లభామ చీరల తయారీకి సంబంధించి ప్రత్యేక సూచనలు చేయటం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమార్తె నగరానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బహుమతిగా ఇచ్చేందుకు కొన్ని చీరల్ని సమంత సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ తన హైదరాబాద్ టూర్ లో ఇవాంక కానీ చర కడితే అది సమంత క్రెడిట్ అవుతుందని చెబుతున్నారు. ఇవాంకతో పాటు ఈ సదస్సుకు వచ్చే మహిళల కోసం గొల్లభామ చీరల్ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మిగిలిన సదస్సులకు భిన్నమైన అనుభూతి విదేశీ పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ ఇవ్వనుందని చెప్పక తప్పదు.