సమత దోషులు ఇక్కడే దొరికి పోయారు

Update: 2020-01-31 06:49 GMT
దిశ కేసులో దోషులను గుర్తించడానికి సీసీటీవీ సహా సెల్ ఫోన్ సిగ్నల్స్ చాలా ఉపకరణాలు హైదరాబాద్ పోలీసులకు ఆయుధం గా నిలిచాయి. కానీ అడవుల జిల్లా కుమరం భీంలో అస్సలు సెల్ ఫోన్స్ సిగ్నల్సే ఉండవు.. ఇక సీసీటీవీలా మచ్చుకైనా లేవు.చుట్టూ అటవీ ప్రాంతమే.. సాంకేతికం గా ఎలాంటి ఆధారాలు , ఆనవాళ్లు లేవు. అయినా ఆదిలాబాద్ పోలీసులు అత్యంత చాక చక్యంగా దోషులను పట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.

దిశ ఘటనతో పోలిస్తే సమత కేసు లో ఎన్నో క్లిష్టమైన అనివార్యతలు ఉన్నాయి. సంక్లిష్టమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఆసిఫాబాద్ డీఎస్పీ, కుమ్రం భీం జిల్లా ఎస్సైలు బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఎంతో శ్రమకోర్చి ఛేదించారు. ఈ కేసులో డీఎన్ఏ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా పోలీసులు కేసును నిరూపించారు. కోర్టును నమ్మించడంలో ఉరిశిక్ష వేయించడం లో పోలీసుల చార్జిషీట్ పనిచేసింది.

సమత రోడ్డుపై వెళుతుండగా నిందితులు ఆమెను ఎల్లాపటార్, రామ్ నాయక్ తండా మధ్యలోని అడవిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సమత అరుపులు ఆ సమీపంలో పత్తి చేనులో ఉన్న పలువురు కూలీలు విన్నారు. ఆ తర్వాత నిందితులు రక్తపు మరకలతో దాహం తీర్చుకోవడాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చూశారు. నిందితుల బట్టలపై రక్తపు మరకలు, నిందితులు వాడిన కత్తి డీఎన్ఏ రిపోర్టుతో సరిపోలాయి. ఇక దోషుల వీర్యం కూడా సమత బాడీ, శరీరంపై దొరికాయి. వాటిని వీరి వీర్యంతో సరిపోల్చగా దోషులు వీరేనని తేలింది. దీంతో పోలీసులకు ఈ మాన్యువల్ ఆధారాలే కీలకంగా మారి దోషులకు కఠిన శిక్ష పడేలా చేశాయి. దోషులు చేసిన పొరపాట్లే వారిని కటకటాల పాలు చేశాయి.

హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన లో ఆధునిక సాంకేతిక తో తెలంగాణ పోలీసులు కేసును ఛేదించగా.. ఇక్కడ నిందితులు చేసిన పొరపాట్లేనే పోలీసులు గుర్తించి సాక్ష్యులను ప్రవేశపెట్టి వారికి ఉరిశిక్ష పడేలా చేశారు.
Tags:    

Similar News