రెండు డోసులు ఒకే ఫోన్ నెంబర్.. కేంద్రం సూచన!

Update: 2022-05-11 11:30 GMT
కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ తోనే రెండో డోసు కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సూచించింది. తద్వారా రెండు డోసులు పొందిన వివరాలను ఆయా లబ్ధిదారులతో ట్యాగ్ చేయడం సాధ్యపడుతుందని వివరించింది. ఒకవేళ ఎవరైనా రోండో డోసు తీసుకోవడానికి వేరే ఫోన్ నెంబర్ వాడితే.. అది కూడా మొదటి డోసుగానే కొవిడ్ పోర్టల్ పరిగణిస్తుందని వివరించింది.

పుణెకు చెందిన రెండున్నర లక్షల మంది... మొదటి డోసు రెండు సార్లు తీసుకున్నట్లు ధ్రువ పత్రాలు వచ్చాయంటూ స్థానిక మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయట. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్తను కవర్ అవడంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజు స్పందించింది.

కొవిన్ పోర్టల్ లో సమస్యలు ఏమీ లేవని... రెండు డోసులు తీసుకున్నట్లు సంపూర్ణ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ కావాలంటే.. రెండు డోసులు తీసుకున్నప్పుడు ఒకటే ఫోన్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది.

కేవలం ఒకే నెంబర్ తో తీసుకుంటే మాత్రమే... రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం వస్తుందని వెల్లడించింది. వేర్వేరు ఫోన్ నెంబర్ల తో రెండు డోసులు పుచ్చుకుంటే... కేవలం పేరు, వయసు, జెండర్ ను బట్టి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ పొందినట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో చాలా కష్టమని వివరించింది. డేటా ఎంట్రీ లోపాన్ని సాంకేతిక సమస్య గా పేర్కొనడం సరికాదని స్పష్టం చేసింది.

మొదటి డోసు రెండు సార్లు తీసుకున్నట్లు ధ్రువ పత్రాలు వచ్చిన వారూ... ఇతరత్రా సమస్యలు తలెత్తిన వారు కొవిన్ పోర్టల్ లో రైజ్ ఎన్ ఇష్యూ ఫీచర్ ను ఉపయోగించి టీకా నమోదు వివరాల్లో లోపాలను కూడా సరిదిద్దు కోవచ్చని తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ సిబ్బంది లేదా హెల్ప్ లైన్ నెంబర్ సాయం కూడా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఏది ఏమైనప్పటికి మన దేశంలో ఇప్పటికే 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని.. ఇక నుంచి అయినా ప్రజలంతా రెండు డోసుల టీకాలు తీసుకునేటప్పుడు ఒకటే ఫోన్ నెంబర్ ను ఇవ్వాలని మరోసారి వ్యాఖ్యానించింది.  మరి ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఒకటే నెంబర్ ఇచ్చి టీకాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News