ఇప్పటికే పలు ఆరోపణలతో ఏపీలోని వైసీపీ మంత్రులు విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఎవరేం అనుకున్నా సరే.. తాము చేయాల్సింది చేసి తీరుతామన్నట్లుగా వారి తీరు ఉంటోంది. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేని రీతిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న ఒక ఉదంతం రాజకీయంగా కలకలం రేపటంతో పాటు.. ఇదెక్కడి బరితెగింపు? నాయనా అంటూ ఆశ్చర్యపోతున్నారట. ఇంతకూ విషయం ఏమంటే..
బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానదిలో కొంతకాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీని వెనుక ఒక మంత్రి హస్తం ఉందన్న మాట తరచూ వినిపిస్తోంది. అధికారులు మాత్రం ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో దందాకు తెర లేచింది. సదరు మంత్రిగారి కారణంగా.. కొందరు తమకు తోచిన రీతిలో ఇసుకను తవ్వేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. దీనిపై అధికార పక్షం లోనూ చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. మంత్రిగారి వ్యవహారశైలేనని చెప్పొచ్చు.
ఏపీలోని ఇసుక తవ్వకాలు.. అమ్మకాలను జేపీ సంస్థకు అప్పజెప్పటం తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు ప్రజా ప్రతినిధులకు ఇసుక నుంచి భారీగా ఆదాయం వచ్చేది. అది కాస్తా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే.. కొన్ని చోట్ల జేపీ సంస్థకు.. అధికారుల అనుమతి లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు.
అలాంటి ఉదంతమే బాపట్ల జిల్లాలోనూ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు.. వైసీపీ నేతల్లోని పలువురికి ఇసుకను తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చేశారట. దీనికి కారణం సీఎం పిలుపునిచ్చిన గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించటం కోసం రోజుకు లక్ష రూపాయిల నుంచి రెండు లక్షల రూపాయిల వరకు ఖర్చులు అవుతున్నాయట.
అంత ఆర్థిక భారాన్ని మోస్తున్నప్పుడు అందుకు తగ్గట్లు ఆదాయాన్ని ఇప్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందని.. అందుకే ఇసుకను తవ్వేసుకొని అమ్మేసుకోవటం ద్వారా పెట్టిన ఖర్చును రాబట్టుకోవాలన్న మంత్రిగారి మాట చర్చనీయాంశంగా మారింది. దీంతో కొల్లూరు.. వేమూరు మండలాల్లోని అధికార పార్టీ నేతలు మంత్రిగారి మాటను ఫుల్ గా వాడేసుకుంటున్నారని చెబుతున్నారు.అధికారులు ఎవరైనా ఎంట్రీ ఇస్తే.. ఇది మంత్రిగారి ఆదేశమన్న మాటతోపాటు అవసరమైన సందర్భంలో మంత్రిగారు సైతం మాట చెప్పేయటంతో ఇసుక తవ్వుడు కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.