ఏపీలో ఆచారం.. తెలంగాణలో అపచారమా?

Update: 2016-12-30 11:20 GMT
ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన పార్టీ టీడీపీ పోకడలు చూస్తుంటే ఎవరికైనా నవ్వొస్తుంది. ఏపీలో తాము చేసిందంతా ఒప్పు... తాము ఇక్కడ చేసిన పనే తమకు తెలంగాణలో ఎదురైతే అది తప్పు అన్న పాలసీ పాటిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు పార్టీ అనుసరిస్తున్నవిధానం ఇప్పుడు చర్చేనీయంగా మారుతోంది.
    
తాజాగా తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా వున్న తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల థియరీని ఫాలో అయ్యింది. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన 15 మందిలో 12 మంది టీఆర్‌ ఎస్‌ లో చేరారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమయ్యామని స్పీకర్‌ కు లేఖ ఇచ్చారు. అయితే వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద అనర్హత వేటు వేయాలని - ఆ 12 మంది టీడీపీ సభ్యులే అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో చర్చకు తెరలేపారు.
    
ఇంతవరకు బాగానే ఉంది.. దీన్నెవరూ తప్పు పట్టనసవరం లేదు, సండ్ర లేఖ ఇవ్వడం అర్థవంతమే అని ఒప్పుకోవాలి. కానీ... ఏపీలో ఆ పార్టీ ఏం చేస్తోందనేది పరిశీలిస్తే ఈ పద్ధతి ఎంతవరకు కరెక్టన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  నవ్యాంధ్రలో ఇప్పటివరకూ 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చేర్చుకున్నారు. మరి వీరిపైనా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం డిమాండ్‌ చేయగలదా?  అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News