ఎన్టీఆర్ ఆత్మ ఎక్క‌డ తిరుగుతుందో చెప్పాడు

Update: 2018-03-29 04:31 GMT
టీడీపీ నేత - ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నేటి నుంచి టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఎన్టీఆర్ ఘాట్ నుంచి ప్రారంభం అవుతాయ‌న్నారు. 1982 మార్చ్‌ 29న పెను సంచ‌లనంగా ఎన్టీఆర్‌ టీడీపీ ఆవిర్భావం చేశారని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆయన దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకు వచ్చారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషిచేశార‌ని తెలిపారు. కడియం శ్రీహరి లాంటి బడుగులకు ఇరిగేషన్‌ శాఖ లాంటి కీలక పదవులను ఎన్టీఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన చేసిన ప్రాంత‌మైన తెలంగాణ ప్రాంతంలోనే ఎన్టీఆర్‌ ఆత్మ తిరుగుతోంద‌ని సండ్ర‌వెంక‌ట వీర‌య్య తెలిపారు.

తెలంగాణలో పేదల గొంతును టీఆర్ ఎస్‌ నొక్కేసిందని సండ్ర‌వెంక‌ట వీర‌య్య‌ ఆరోపించారు. తెలంగాణ ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆ పార్టీ నేత సండ్ర వెంక‌ట వీర‌య్య ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ బలహీన పడితే బడుగు బలహీన వర్గాలకు పథకాలు అందవని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం కాకుండా టీడీపీని నిర్వీర్యం చెయ్యడం కోసమే టీఆర్ఎస్‌, కేసీఆర్‌ పనిచేస్తున్నారని విమర్శించారు. మళ్ళీ బడుగులు సంతోషంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
Tags:    

Similar News