హైదరాబాద్ వచ్చిన జేఎన్ యూ విద్యార్థి కన్నయ్య మీద చెప్పులు పడ్డాయి. ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి కన్నయ్య హాజరయ్యారు. కన్నయ్య ప్రసంగం మొదలు పెట్టే సమయంలో అతడికి వ్యతిరేకంగా ఇవ్దరు యువకులు ఒక్కసారిగా లేచి.. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలు చేసి.. చెప్పులు విసిరారు. దీంతో.. వారిని పట్టుకున్న ఏఐఎస్ ఎఫ్ విద్యార్థులు ఇద్దరు యువకులపై పిడిగుద్దులు విసిరారు.
ఈ ఇద్దరు యువకులు మీడియా వైపు ఉండటం.. అక్కడి మీడియా స్టాండ్లు తీసుకొని చితకబాదారు. దీనికి స్పందించిన కన్నయ్య.. ‘‘కుచ్ మత్ కర్ దీజియే’’ (అతన్ని ఏమీ చేయొద్దు) అని అరవటం కనిపించింది.అయినప్పటికీ అతన్ని అక్కడున్న వారు పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన కొద్దిపాటి గందరగోళానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో చెప్పు విసిరిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కన్నయ్య తన ప్రసంగంలో.. తనకు తెలుగు తెలీదని.. కానీ దళితుల్ని తెలుగులో ‘‘గాడు’’ అని అంటారన్నారు. కొంతమంది తనను కొట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నారని.. కానీ చెప్పులు విసిరితే ఎలాంటి ప్రయోజనం ఉందని వ్యాఖ్యానించారు. తన మీద చెప్పులు విసిరే వారి మీద తనకు కోపం లేదని.. తనను జైలుకు పంపిన వారి మీద కూడా ఎలాంటి కోపం లేదని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. కన్నయ్య మీద చెప్పు విసిరిన వ్యక్తి బీజేపీ అనుబంధ సంస్థ అయిన గోరక్షా దళ్ కు చెందిన కార్యకర్తగా చెబుతున్నారు. ఈ సంస్థకు చెందినపలువురు ముందుగానే కన్నయ్య ప్రసంగించే వేదిక వద్దకు వచ్చారని.. కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. చెప్పు విసిరిన వ్యక్తుల్లో ఒకరిని పవన్ కుమార్ రెడ్డిగా గుర్తించారు. అతన్ని విచారించిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెప్పు విసిరినందుకు పిడిగుద్దులే కాదు.. కేసు కూడా మీద పడిందన్న మాట.