సానియా మీర్జా ఫొటో కింద పీటీ ఉషా! నిజమేనా?

Update: 2019-08-29 10:36 GMT
ఒకవైపు సోషల్ మీడియా ప్రభావవంతమైనది అని ఒప్పుకోవాల్సిందే కానీ - మరోవైపు అందులో ఫేక్ పోస్టుల సృష్టి కూడా చాలానే ఉంటోందని వేరే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో ఏది నిజమో  - ఏది అబద్ధమో నిర్ధారించుకోవడం అంత తేలికైనది ఏమీ కాదు. ఆ నిర్ధారణ ఇక్కడ కూడా చేయడం లేదు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఇది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఒకదాంట్లో చిన్న పొరపాటు దొర్లినట్టుగా ఉంది. వాటిని తయారు చేసేది ఎవరో కంప్యూటర్ ఆపరేటర్లు. వారికి సానియాకు - పీటీ ఉషాకు తేడా తెలీకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు.

అయితే ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి ఏర్పాటు చేసే అధికారులు అయినా కొంచెం చూసుకోవాల్సింది. పైన ముఖ్యమంత్రి - మరో మంత్రి ఫొటో కూడా ఉన్న నేపథ్యంలో ఇలాంటి పొరపాట్లను వైరల్ చేసే వాళ్లు ఎక్కువవుతారు. అయితే ఇది నిజంగా పొరపాటు అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇది క్రియేషన్ కూడా అయి ఉండొచ్చు. గత కొన్ని రోజులుగా రకరకాల సోషల్ మీడియా నకిలీ పోస్టులు బయటపడుతూనే ఉన్నాయి.  నిజమో - నకిలీనో కానీ.. ఇది వైరల్ అయితే సాగుతోంది.


Tags:    

Similar News