జమ్ము కశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారి ఆసిఫాపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసుపై విచారణ జరిపేందుకు తాజాగా సుప్రీంకోర్టు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కథువాలో జరిగిన ఈ దారుణంపై లిఖితపూర్వకంగా న్యాయవాదులు ఫిర్యాదు సమర్పిస్తే విచారణకు సిద్ధమేనని ప్రకటించించింది. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా...ఆ ఘటనపై స్పందించింది. అయితే, సానియా జాతీయతను ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ కు ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి సానియా కూడా ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘‘ప్రపంచానికి మనం నిజంగా ఇలాంటి దేశాన్ని చూపించాలనుకుంటున్నామా? కుల, మత, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా అందరం ఈ 8 ఏళ్ల బాలిక తరపున నిలబడాలి. లేకుంఏ ప్రపంచంలో మరే విషయానికి అండగా నిలబడినట్లు కాదు. అది మానవత్వం అని కూడా అనిపించుకోదు. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది...’’ అని సానియా ట్వీట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆమె జాతీయతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
సానియా ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ ఆమె జాతీయతను ప్రశ్నించాడు. సానియా మీర్జా అంటే గౌరవమంటూనే ఆమె ఇండియన్ కాదని కామెంట్ చేశాడు. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుందని, పాక్ ఉగ్రమూకల చేతిలో బలవుతున్న అమాయకులపై కూడా ట్వీట్ చేయాలని కామెంట్ పెట్టాడు. ఆ వ్యాఖ్యలకు సానియా ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది. ‘‘ఓ వ్యక్తి ఏదేశం వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చు. నేను ఏ దేశస్తురాలినో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులు చెప్పక్కర్లేదు. నేను భారత దేశం కోసమే ఆడతాను. నేను ఇప్పటికీ ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటాను. ఒకవేళ నువ్వు దేశం, మతాలకు అతీతంగా ఆలోచించగలిగితే... ఒకనాటికి మానవత్వం వైపు కూడా నిలబడతావు...’’ అంటూ సానియా చురకలంటించింది.