భారతీయ సంప్రదాయ వస్త్రధారణ అనగానే చీరకట్టు గుర్తుకొస్తుంది. చీరెకట్టులో ఉన్నప్పుడు కనిపించే అందం వేరు. అందుకే విదేశీ వనితలు సైతం చీరెలు కట్టుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే, ఆధునిక యువతులు మాత్రం తమ ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వస్త్రధారణకు మారుతున్నారు. ప్రముఖ సంప్రదాయ దుస్తుల ఆన్ లైన్ సంస్థ క్రాఫ్ట్ విల్లా ప్రపంచ ఎథినిక్ డే (ఆదివారం నాడు) నేపథ్యంలో క్రీడారంగం సెలబ్రిటీలకు మే 20 నుంచి జూన్ 5 వరకు ఓ సర్వే చేసింది. అందులో... చక్కటి వస్త్రాలంకరణతో ఆకట్టుకున్న క్రీడారంగం సెలబ్రిటీగా సానియా మీర్జా అగ్రస్థానంలో నిలిచారు.
టెన్నిస్ లో పలు రికార్డులను బద్దలు కొడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్న సానియా పలు కార్యక్రమాల్లో పాల్గోవల్సి వచ్చినప్పుడు లెహంగా - చీరెలు - అలాగే అనార్కలి వంటి ఆకర్షణీయమైన దుస్తులు ధరించి ఆకట్టుకుంటున్నారు. ఈ సర్వేలో సానియాకు 62.9 శాతం ఓట్లు లభించగా, భారత ఏస్ షట్లర్ సైనా 18.8 శాతం ఓట్లతో రెండోస్థానంలో - స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ 9.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
జ్వాలా గుత్తా - అశ్వినీ పొన్నప్ప - షూటర్ హీనా సిద్దూ సైతం కూడా మంచి వస్త్రధారణ పాటించే క్రీడాకారిణులుగా సర్వేలో మార్కులు కొట్టేశారు. సర్వేలో భాగంగా క్రీడాకారిణులు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ లు చేయడం స్వాగతించగలిగే పరిణామమని క్రాఫ్ట్ విల్లా వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సానియా అభిమానులు మాత్రం ఆమె సంప్రదాయ దుస్తుల్లోనైనా టెన్నిస్ దుస్తుల్లోనైనా ఎలా అయినా కూడా అందంగా ఉంటుందని అంటున్నారు.