మోదీ స‌ర్కార్ పై మ‌హిళ‌ల విజ‌యం!

Update: 2018-07-21 16:39 GMT
2014లో న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత `స్వ‌చ్ఛ భార‌త్`కార్య‌క్ర‌మానికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలు మొద‌లు....మెట్రో సిటీల వ‌ర‌కు ఈ కార్య‌క్రమాన్ని చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. అయితే, అందుకు విరుద్ధంగా మోదీ స‌ర్కార్ ....మ‌హిళ‌లు ఉప‌యోగించే శానిట‌రీ ప్యాడ్స్ పై 12 శాతం జీఎస్టీ విధించడంతో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు అత్యంత అవ‌స‌ర‌మైన శానిట‌రీ ప్యాడ్స్ కు జీఎస్టీ నుంచి మిన‌హాయింపునివ్వాల‌ని తీవ్ర‌స్థాయిలో డిమాండ్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా - శానిట‌రీ ప్యాడ్స్ కు జీఎస్టీ నుంచి మిన‌హాయింపునిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్టీ మండ‌లి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 27 నుంచి సవరించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో నేడు జరిగిన జీఎస్టీ 28వ మండలి సమావేశంలో ప్యాడ్స్ తో పాటు ప‌లు వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గించాల‌ని నిర్ణ‌యించారు.

శానిటరీ నాప్కిన్స్ - మార్బుల్స్ - రాఖీలు - రాతితో తయారు చేసే దేవతల విగ్రహాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తూ మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. వీటితోపాటు  మరో 13 వస్తువులపై పన్నులను తగ్గించింది. 1000 రూపాయల లోపు విక్రయించే పాదరక్షలను 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకు వ‌చ్చింది. లిథియం ఐయాన్‌ బ్యాటరీలు - వ్యాక్యుమ్‌ క్లీనర్స్‌ - ఫుడ్‌ గ్రైండర్లు - మిక్సీలు - వాటర్‌ హీటర్లు - హెడ్‌ డ్రైయర్లు - హ్యాండ్‌ డ్రైయర్లు - పెయింటింగ్స్‌ - వార్నిష్‌ - వాటర్‌ కూలర్‌ - మిల్క్‌ కూలర్‌ - ఐస్‌క్రీం కూలర్‌ - పెర్ఫ్యూమ్స్‌ - టాయిలెట్‌ స్ప్రే లను 28శాతం పన్ను శ్లాబు నుంచి తొలగించి 18శాతం పన్ను శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు పీయూష్ తెలిపారు. వాటితో పాటు  ఏసీలు - టీవీలు - వాషింగ్‌ మెషీన్లపై  విధిస్తున్న పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు.‌ హ్యాండ్‌ బ్యాగ్స్‌ - జ్యువెలరీ బాక్స్‌ - అద్దాలు - హ్యాండ్‌ మేడ్‌ ల్యాంప్స్‌ తో పాటు ఇతర వస్తువులను 12శాతం పన్ను శ్లాబు పరిధిలోకి తీదిగుమతి చేసుకునే యూరియాపై  జీఎస్టీని 5శాతం తగ్గించారు.సుకొచ్చారు.

రూ.5కోట్ల టర్నోవర్‌ కలిగి ఉన్న వ్యాపారులు ప్రతి నెలా జీఎస్టీని చెల్లించాలని పీయూష్ తెలిపారు. అయితే, ప్రతి 3 నెలలకు రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 18శాతం పన్ను పరిధిలో ఉన్న ఇథనాయిల్ ను 5శాతం పన్ను శ్లాబులోకి తెచ్చారు. ప్రత్యేక అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాలు - వర్క్‌ ట్రక్స్‌ ను 18శాతం పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట లభించింది. తగ్గించిన పన్ను ధరలు జులై 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 4న ఢిల్లీలో తదుపరి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. సూక్ష్మ - చిన్న - మధ్య తరహా వ్యాపార రంగంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.




Tags:    

Similar News