రిపబ్లిక్ టీవీ చానల్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారంపై సేన ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఆర్నాబ్ అరెస్టును ఖండించటం.. మహారాష్ట్రలోని సేన సర్కారు తీరును తప్ప పట్టటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లైంది. కేంద్రమంత్రులు మొదలు పలువురు నేతలు ఆర్నాబ్ ఆరెస్టు సరికాదని.. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
దీంతో.. సేన నేత సంజయ్ రౌత్ రంగంలోకి దిగారు. తమపై వస్తున్న విమర్శల్ని తప్పు పట్టారు. ఆర్నాబ్ అరెస్టును ప్రతీకార కోణంలో చూడటం సరికాదంటున్నారు. ప్రతీకారమన్న పదమే తమకు ఉండదని.. అంతా పద్దతి ప్రకారమే చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చట్టప్రకారమే అంతా జరుగుతుందని.. తగిన ఆధారాలు ఉంటే పోలీసులకు ఇస్తే చర్యలు తీసుకుంటారన్నారు.
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఇప్పటివరకు ఎవరిపైనా ప్రతీకార చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని గర్తు చేశారు. ఇక.. ఈ అంశంపై మహారాష్ట్ర హోం మంత్రి స్పందిస్తూ.. 2018లో నమోదైన ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు విషయంలోనే ఆర్నాబ్ ను అరెస్టు చేశామన్నారు. ఆర్నాబ్ అరెస్టు సిగ్గుచేటు అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానిస్తే.. మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం ఆర్నాబ్ కు మద్దతుగా నిలిచారు.
ఇంతమంది స్పందిస్తున్న ఈ అంశంపైన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ స్పందించలేదన్న లోటు లేకుండా ఆమె కూడా రియాక్టు అయ్యారు. ఆర్నాబ్ మీద ఇష్టం ఉన్నా లేకున్నా.. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలవాలన్నారు. మౌనంగా ఉంటే అణిచివేతకు మద్దతు ఇచ్చినట్లేనని ప్రకటించారు. కంగనా చెప్పిన మాట నిజమే అయినా.. అందరి విషయంలోనూ ఈ బాలీవుడ్ ‘క్వీన్’ ఇదే రీతిలో ఎందుకు స్పందించరంటారు? ఇక.. సంజయ్ రౌత్ వ్యాఖ్యల్నే తీసుకుంటే..అంతా పద్దతి ప్రకారమే జరుగుతున్నదే నిజమైతే.. జుట్టు పట్టి లాగి అరెస్టు చేయటం కూడా చట్టప్రకారమే చేసినట్లా?