అయోధ్యలో లేఖ దొరకలేదు - అదీ సంస్కృతమూ కాదు!

Update: 2020-06-14 11:43 GMT
రామజన్మభూమి అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో ఓ రాగి పాత్ర - అందులో సంస్కృత లేఖ లభ్యమైనట్లు ఇటీవల వీడియో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో రామజన్మభూమి తవ్వకాల్లో లభించిందేనా అంటే కాదనే చెబుతున్నారు. రాగిపాత్రలో సంస్కృత లేఖ లభ్యమైందంటూ పుష్పేంద్ర కులశ్రేష్ఠ్ అనే పొలిటికల్ కామెంటేటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి వేలాది రీట్వీట్లు - లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో - రాగి పాత్ర - సంస్కృత లేఖపై వివిధ రకాల ప్రచారం సాగింది. కానీ ఇది రామజన్మభూమి స్థలంలో జరిగిన తవ్వకాల్లో దొరికింది కాదట. రామాలయం కోసం జరుపుతున్న తవ్వకాల్లో ఇలాంటి వస్తువులు ఏదీ కనబడలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో ఉన్న భాష సంస్కృతంగా భావిస్తున్నారు. కానీ అధి హిబ్రూ బాష అని చెబుతున్నారు. అంటే ఇది యూదులు వాడే భాష.

పుష్పేంద్ర కులశ్రేష్ఠ్ షేర్ చేసిన ఈ వీడియో 28 సెకండ్ల పాటు ఉంది. ఆయన కూడా ఇది రామజన్మభూమిలో దొరికినట్లు పేర్కొన్నారు. దీనిని చాలామంది ట్విట్టర్ - ఫేస్‌ బుక్‌ లలో షేర్ చేస్తూ టైమ్స్ క్యాప్సూల్ అని - రామాయణం వివరాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఈ వీడియోను ఒకరు తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో డిఫైన్ అవ్సిసీ పేరుతో షేర్ చేశారు. వీరు అరుదైన - పురాతన వస్తువులను - నాణేలను పోస్ట్ చేస్తారని తేలింది.
   

Tags:    

Similar News