అమ్మ మరణవార్త ఆయనకు ముందే తెలిసింది..

Update: 2016-12-07 09:55 GMT
శాంతకుమార్... ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీకి ఎండీ. జయలలిత మరణించారన్న వార్త మీడియా కంటే ముందే ఆయనకు తెలిసింది... ఇంతకీ ఆయనెవరు.. ఆయనకెలా తెలిసిందనుకుంటున్నారా. శాంతకుమార్ ది శవపేటికలు తయారు చేసే వ్యాపారం. మన దేశంలో ప్రముఖులంతా ఆయన కంపెనీనుంచే ఆర్డరు చేసి తెప్పించుకుంటారు. అందులో భాగంగా జయ మరణించగానే శాంతకుమార్ కు సమాచారం ఇచ్చారు.

1994లో ఈ సంస్థ ప్రారంభమైన ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీ సంస్థ గతంలో మాజీ ప్రధాని పీవి నరసింహరావు - నటుడు శివాజీ గణేశన్ - సీనియర్ నటి మనోరమ వంటి వారెందరికో శవపేటికలు తయారు చేసిచ్చింది.  జయలలిత మరణవార్త తెలియగానే - ఆమెకోసం హెవీ డ్యూటీ ఫ్రీజర్ బాక్స్ తో కూడిన కఫిన్ తయారు చేసినట్టు శాంతకుమార్ తెలిపారు. అంతేకాదు... రాజాజీ హాల్ లో జయలలిత దేహం అందరికీ కనిపించేలా ఏటవాలుగా ఉంచిన ఆలోచన కూడా శాంతకుమార్ దే.
    
శవపేటికపై ఏటవాలుగా దేహాన్ని ఉంచితే, జారిపోతుందని కొందరు భయపడ్డారు. కానీ అలా జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని.. వినూత్న రీతిలో దాన్ని డిజైన్ చేశామని శాంతకుమార్ చెబుతున్నారు.  సాధారణ వాతావరణంలో ఉన్నా రెండు నుంచి మూడు రోజుల పాటు శరీరాన్ని సున్నా నుంచి ఐదు డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలో ఉంచే ప్రత్యేకమైన కఫిన్ అది. పోయిస్ గారస్డెన్ నుంచి - జయలలిత శవపేటిక రాజాజీ హాల్ - ఆపై అక్కడి నుంచి అన్నా సాలైకి జయలలిత మృతదేహం చేరే వరకూ అంతా శాంతకుమార్ చూసుకున్నారట.  శాంతకుమార్ సంస్థ ఇప్పటివరకూ 500 మందికి పైగా వీఐపీలకు శవపేటికలు అందించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News