ఎంత అద్భుతంగా రాణించే క్రికెటర్ అయినా ఓ దశ వచ్చాక రిటైర్ అవ్వాల్సిందే. తద్వారా కొత్త వాళ్లకు అవకాశాలు వస్తుంటాయి. అయితే రిటైర్ అయిపోయిన చాలా మంది క్రికెటర్లు .. క్రికెట్ తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. అంపైర్గానో.. కోచ్‌గానో, కామెంటేటర్‌గానో తమ ప్రతిభను కొనసాగిస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ మహిళా క్రికెటర్ పురుషుల జట్టు కోచ్‌గా అవకాశం దక్కించుకుంది. ఎంతో నైపుణ్యం ఉన్న సీనియర్ క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అటువంటిది ఓ పురుష జట్టుకు ఓ మహిళా క్రికెటర్ కోచ్‌గా ఎంపికైంది. క్రికెట్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ ఈ అరుదైన ఘనత సాధించారు. పురుషుల క్రికెట్ జట్టుకు ఆమె కోచ్ గా వ్యవహరించబోతున్నారు. ఇంగ్లాండ్ లోని దేశవాళీ జట్టు ససెక్స్ కు ఆమె వికెట్ కీపింగ్ కోచ్ గా నియమితులయ్యారు. సారా గతంలో పలుమార్లు పురుషులతో కలిసి క్రికెట్ ఆడారు. టేలర్ ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడారు. 2019లో ఆమె రిటైర్ అయ్యారు. ఆమె వన్డేల్లో 4056, టీ20ల్లో 2177 పరుగులు సాధించారు. అన్ని ఫార్మాట్లలో కలిసి 104 స్టంపింగ్స్, 128 క్యాచులు పట్టారు. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ గెలవడం లో సారా కీలకపాత్ర పోషించారు.
టీమిండియాతో ఫైనల్లో ఇబ్బుందుల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను సేవ్ చేశారు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆ టైంలో ఆమె పేరు బాగా వినిపించింది. మహిళా కోచ్ గా ఎంపిక కావడం పట్ల టేలర్ ఏమందంటే.. ‘ససెక్స్‌లో ఎంతో ప్రతిభావంతులైన వికెట్ కీపర్ల బృందం ఉంది. వారితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా. వారికి నేను పూర్తిస్థాయి సహాయసహకారాలు అందిస్తా. నా అనుభవ సారాన్ని రంగరించి వారిని మరింత మెరుగైన వాళ్లకు తీర్చిదిద్దడానికి కృషి చేస్తా. ఏ పని అయినా చాలా సులువుగా చేయడం నాకు అలవాటు. సులువైన పద్దతులతో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు’ అని ఆమె పేర్కొన్నారు.