తమిళ సీనియర్ నటి.. జయలలిత మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక సుదీర్ఘ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ తమిళ జనాల మనోభావాల్ని ప్రతిబింబించిందని కొందరు అంటుంటే.. ఇంకొందరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న గౌతమి ఏదో ప్రయోజనం ఆశించే ప్రధానికి ఇలా లేఖ రాసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమి మీద పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ మరో సీనియర్ నటుడు శరత్ కుమార్ ప్రధాని తనో లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జయ మృతిపై సందేహాలు వ్యక్తం చేయడాన్ని దెప్పి పొడుస్తూ శరత్ ఈ లేఖను రాయడం విశేషం.
కొందరు తమను తాము సామాన్య పౌరులుగా చెప్పుకుంటూ జయలలిత మృతి విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు జయలలితకు అందించిన చికిత్సను పర్యవేక్షించినా.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పరోక్షంగా గౌతమిని విమర్శించాడు శరత్ కుమార్. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తమిళ నాడులోని ప్రతి ఒక్కరిని కించపరచడమేనని.. ఎన్నో దశాబ్దాలుగా జయలలిత అండగా నిలిచిన వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఆరోపణలు చేయడం.. ప్రధానికి నివేదించడం సరికాదని.. అందరి దృష్టినీ తన వైపు తిప్పుకోవడానికే ఇలాంటి ఎత్తుగడ వేశారని శరత్ విమర్శించాడు. మరి తనపై శరత్ పరోక్షంగా చేసిన విమర్శలపై గౌతమి ఎలా స్పందిస్తుందో చూడాలి.