క్రికెట్ అంటే భారతీయులతో పాటు.. దాయాది పాకిస్తానీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాది దేశాలు రెండు తలపడుతున్నాయంటే చాలు.. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ ను ప్రత్యేకంగా చూస్తారు. ఇక.. రెండు దేశాల ప్రజల గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. పనుల్ని పక్కన పెట్టేసి.. ఈ మ్యాచ్ కోసం సమయాన్ని కేటాయించటం కనిపిస్తుంది.
వర్షం కారణంగా భారత్ -పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా? అన్న సందేహాలకు తెర తీస్తూ వరుణుడు కరుణించటంతో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ప్రధాని కమ్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ కు సూచన ఇచ్చారు. మిగిలిన ప్రధానులకు ఇమ్రాన్ కు వ్యత్యాసం ఉంది. క్రికెట్ లో సీనియర్ ప్లేయర్ తో పాటు.. పాక్ కు 1992 వరల్డ్ కప్ ను అందించిన కెప్టెన్ గా సుపరిచితుడు.
భారత పాక్ మధ్య జరిగే మ్యాచ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇమ్రాన్ కు బాగా తెలుసు. అందుకే కాబోలు ఆయన తన జట్టు కెప్టెన్ కు సలహా ఇస్తూ.. టాస్ గెలిస్తే కచ్ఛితంగా బ్యాటింగ్ చేయాలని.. భారత్ కు బౌలింగ్ అవకాశం ఇవ్వాలన్నాడు. అంతేకాదు.. జట్టు కూడా ఎలా ఉంటుందో తన సలహా చెప్పారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇమ్రాన్ ఇచ్చిన సలహాను పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ లైట్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన ఆయన.. ప్రధాని ఇమ్రాన్ చేసిన సూచనకు బదులుగా బౌలింగ్ తీసుకున్నాడు. మరి.. ఈ మ్యాచ్ గెలిస్తే ఓకే. లేనిపక్షంలో అనుభవజ్ఞుడు ఇచ్చిన సలహా తీసుకోకుండా తప్పు చేశారన్న విమర్శను ఎదుర్కొనే అవకాశం ఉంది.