జయలలిత నెచ్చలి.. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే ఓటమి నేపథ్యంలో మళ్లీ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదుడుకలకు లోనైంది. ముందు పన్నీర్ సెల్వం.. ఆ తర్వాత ఫలని స్వామి సీఎంగా అయ్యారు. శశికళ జైలు పాలయ్యారు.బీజేపీని ఎదురించినందుకు ఆమెకు ఈ గతి పట్టిందని అందరూ అనుకున్నారు.
ఇప్పుడు అన్నాడీఎంకే దారుణంగా ఓడిపోయిన వేళ శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి శశికళ మాట్లాడిన ఓ ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘ఎవరూ ఆందోళన చెందొద్దు. పార్టీని తప్పకుండా చక్కబెడుతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను’ అని శశికళ సదురు ఆడియోలో చెప్పారు. దీనికి మీ వెంటే మేముంటాం అని కార్యకర్తలు అన్నట్టుగా ఆడియోలో ఉంది.
దీంతో వచ్చే ఎన్నికల్లోగా అన్నాడీఎంకేను టేకప్ చేసి ప్రస్తుత సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఓడించేందుకు శశికళ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.