అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను జైల్లో ఉన్న తర్వాత నుంచి తమ పార్టీకి చెందిన నేతలు తనను పెద్దగా పట్టించుకోవటం లేదని.. తనకు సంబంధించిన అంశాల మీద సరిగా దృష్టి సారించటం లేదన్న భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనను కలిసేందుకు వస్తున్న మంత్రులకు ఆమె తలంటు కార్యక్రమాన్ని జైల్లోనే నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అక్రమాస్తుల కేసులో అప్పీలుకు వెళ్లటం.. పార్టీప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్ పై కాలయాపన జరుగుతోందని.. పార్టీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా చిన్నమ్మ ఫీల్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. పవర్ లో ఉన్నామన్న మాటే కానీ.. తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవటంలో నేతలు ఫెయిల్ అయినట్లుగా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
పదవీ గండం నుంచి తనను గట్టెక్కించాలన్న ఫీలింగ్ పార్టీలో ఎవరికి లేదన్న మాట ఆమె నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. చిన్నమ్మ నోటి నుంచి ఈ తరహా గుస్సాను ఏ మాత్రం ఊహించని నేతలు అవాక్కైనట్లుగా చెబుతున్నారు. చిన్నమ్మ ఇంత తీవ్రంగా ఆగ్రహం చెందటంపై విస్మయానికి వ్యక్తం చేసిన మంత్రులు పలువురు.. ఏం చేయాలో తమకు పాలుపోవటం లేదని చెబుతున్నారు.
తాము ఏదో చేయాలని చిన్నమ్మ అనుకుంటున్నా.. పరిస్థితులు అందుకు తగినట్లుగా లేవన్నది వారి వాదన. చిన్నమ్మ కుటుంబ సభ్యులే అన్ని వ్యవహారాల్ని చూస్తున్నప్పుడు.. తాము ఎలా జోక్యం చేసుకుంటామన్న వాదనను వినిపిస్తున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా తమ పరిస్థితి మారిందని ఫీలవుతున్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/