జైల్లో ‘చిన్నమ్మ’ తొలి రోజు ఇలా..

Update: 2017-02-17 04:48 GMT
అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమైన శశికళ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం పరప్పన అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఎదుట హాజరైన ఆమె.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను జైలుకు తరలించారు. తనను వీఐపీ ఖైదీలా ట్రీట్ చేయాలన్న చిన్నమ్మ కోర్కెకు నో చెప్పిన జడ్జి.. ఆమెను సాధారణ ఖైదీలా ట్రీట్ చేయాలని చెప్పటంతో.. ఆమె వెంట తెచ్చుకున్న వస్తువుల్లో ప్లేటు.. గ్లాసు తప్ప మరింకేమీ జైలు లోపలకు అనుమతించలేదు.

‘చిన్నమ్మ’ హోదాలో జైల్లో తొలిరాత్రి నిద్ర పట్టలేదని తెలుస్తోంది. తీవ్ర ఆవేదనతో ఆమె ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. రాత్రి ఏమీ తినకుండానే ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. రూల్స్ ప్రకారం నేల మీద చాప.. దిండు వేసుకొని.. రగ్గు కప్పుకొని ఆలస్యంగా నిద్రపోయినట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం 5.30 గంటలకే నిద్ర లేచిన శశికళ.. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైల్లో పచార్లు చేశారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వెజిటబుల్ పలావ్ ను తిన్నారు. ఆ తర్వాత జైలు గ్రంధాలయానికి వెళ్లి ఇంగ్లిషు.. తమిళ దినపత్రికల్ని చదివి.. జైలు బ్యారెక్ లోనే విశ్రాంతి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో టీ తాగిన చిన్నమ్మ.. తర్వాత తనతో జైలుకు వచ్చిన ఇళవరసితో కాసేపు మాట్లాడారు.

ఆపై జైలులోని సహ ఖైదీలతో మాట్లాడిన ఆమె.. రాత్రివేళ మితాహారాన్ని తీసుకొన్నట్లుగా చెబుతున్నారు. ఆమెను కలిసేందుకు భారీ ఎత్తున నేతలు.. కార్యకర్తలు జైలుకు వచ్చినా అధికారులు మాత్రం ఆమెను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. తాను ఎంపిక చేసిన పళనిస్వామి.. ముఖ్యమంత్రి హోదాలో శుక్రవారం పరప్పన జైలుకు రానున్నారు. చిన్నమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News