తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. జయలలిత నెచ్చలి శశికళ విడుదల ఒకే సమయంలో జరగబోతోంది. వచ్చే సంవత్సరం జనవరిలో అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ విడుదల అవుతోంది. ఆ తర్వాత మార్చిలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు చిన్నమ్మ శశికళ ఇప్పటి నుంచే జైల్లోనే వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా న్యాయనిపుణులతో చర్చించి కేవియేట్ పిటీషన్ దాఖలు చేసేందుకు ఆమె ప్రతినిధులు నిమగ్నమయ్యారు.
జనవరిలో విడుదల అవుతున్న శశికళ తాజాగా సోమవారం తన న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ కు రాసిన లేఖ వెలుగుచూసింది. సుప్రీం కోర్టులో ఆమె తరుఫున కేవియట్ దాఖలుకు కసరత్తు చేయాలని అందులో ఉంది. శిక్ష పడడంతో నాలుగేళ్లు జైలులో ఉన్న శశికళకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. దీంతో తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్ పిటీషన్ దాఖలు చేయాలని ఆమె తన లాయర్లను కోరారు. పిటీషన్ దాఖలుతో ఎన్నికల్లో పోటీచేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది.
తన శిక్ష విషయం పునసమీక్షించేందుకు.. కోర్టులో పిటీషన్ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్లు సమాచారం. అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగిందని.. అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని శశికళ పిటీషన్ వేస్తున్నారు. ఈ మేరకు శశికళ ప్రతినిధి దినకరన్, న్యాయవాది పాండియన్ ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులు, న్యాయ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
శశికళ విడుదల తర్వాత ఈ పిటీషన్ కోర్టుకు వెళ్లొచ్చని అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ ఖాయమని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. విడుదల కోసం చిన్నమ్మ కోర్టుకు చెల్లించాల్సిన జరిమానా రూ.10కోట్లను సిద్ధంగా ఉంచామని న్యాయవాది పాండియన్ తెలిపారు. దీంతో శశికళ విడుదల అనంతరం ఎన్నికల్లో పోటీచేసేందుకు కావాల్సిన సరంజామా రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళనాడు సీఎం కావాలని ఇప్పటినుంచే శశికళ జైలునుంచే వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.