సెకండ్ టెర్ములో శశికళ తొలి జైలు రాత్రి దాదాపుగా నిద్ర లేకుండా గడిచిందట. ఏదో అవుదామనుకుంటే ఇంకేదో కావడంతో శశికళ పూర్తిగా దిగులుగా ఉందని.. ఆమె రాత్రంతా నిద్రలేకుండా గడిపారని చెబుతున్నారు. పైగా తోటి ఖైదీ రాత్రి పదిన్నరకే లైటు ఆపేయాలని చెప్పడంతో శశికళ చీకట్లో సరైన నిద్ర లేకుండా రాత్రంతా గడిపారట.
బెంగళూరు పరప్పన అగ్రహారంలోని ఓ బ్యారక్ ను శశి తన మేనకోడలు ఇళవరసి - మరో ఖైదీతో కలసి పంచుకున్నారు. తొరోజు రాత్రి 10:30 గంటలైనా - లైట్లు ఆర్పక పోవడంతో - తాను నిద్రపోవాలని చెబుతూ, వెంటనే లైట్లు ఆర్పివేయాలని గదిలోని వేరే ఖైదీ చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శశికళ నడుం వాల్చినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శశికళ గత రాత్రి సరిగ్గా నిద్రించలేదని, పలుమార్లు లేచి కూర్చున్నారని బ్యారక్ కు కాపలాగా ఉన్న సెంట్రీలు చెబుతున్నారు.
తెల్లవారుజామున 4:30 గంటలకే నిద్రలేచిన ఆమె - పత్రికలు ఎన్ని గంటలకు వస్తాయి? నాకు తమిళ పత్రికలు తెచ్చివ్వండి, అందుబాటులో ఉన్న అన్ని పేపర్లూ తెండి అని కోరడంతో, సిబ్బంది వాటిని తెచ్చిచ్చారు. ఆంగ్ల పత్రికలను వెంటనే ఇచ్చిన సిబ్బంది, తమిళ పత్రికలు మాత్రం ఉదయం 7 గంటల తరువాతనే వస్తాయని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా శశికళ అంతకుముందు శశికళ - జయలలిత ఇదే జైల్లో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడిన కొందరు మహిళా పోలీసులను గుర్తించిన శశికళ, వారిని పలకరించారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/