అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభం షాక్ గోల్డెన్ బే రిసార్ట్ యజమానికి తగిలింది. ఆరు రోజులుగా శశికళ వర్గం ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 200 మంది బస చేసిన చెన్నైలోని గోల్డెన్ బే బీచ్ రిసార్ట్ బిల్లు ఎవరు కడుతారనే దానిపై నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ రిసార్ట్‌లోని మూడు విభాగాల్లో రోజుకు రూ.7 వేల నుంచి 10 వేల అద్దె ఉన్న 60 గదులున్నాయి. ఇందులోని ఒక్కోగదిని ఒకేరేటులో రూ. 7వేలకు బుక్ చేసుకున్నా రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీరికి ఆహారం - పండ్లు - మద్యం కలిపి ఒక్కొక్కరికి రోజుకు రూ. 2 వేల చొప్పున మరో రూ. 25 లక్షలు కావచ్చు. ఎమ్మెల్యేలకు కొత్త దుస్తులను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అంతేకాదు ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉండటానికి పలు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటి ఖర్చులను కలిపి దాదాపు కోటి రూపాయల వరకు తేలిగ్గా అవుతుంది.
తాజాగా గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేల తరలింపు, చిన్నమ్మ శశికళపై కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ బిల్లు ఎవరు కడతారనే వాదన వినిపిస్తోంది. చిన్నమ్మ ఉంటే ఆమె చెల్లించే వారని, కానీ ఆమె జైలుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో ఆమె టీం ఎమ్మెల్యేలు ఎలా ముందుకు సాగుతారని చెప్తున్నారు. కాగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పొయెస్ గార్డెన్ లోనే ఉన్నారు. శశికళను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఆమెకు ఇంకా అందలేదు. తీర్పు కాపీ అందుకున్న అనంతరం ఆమె కోర్టులో లొంగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శశికళ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె మద్దతు దారులు తెలిపారు.
ఇలా ఉండగా తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇటు శశికళ వర్గం తమ నేతగా ఎన్నుకున్న పళని స్వామి, అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరిన నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆశక్తిగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/