చిన్నమ్మకు కలిసి రాని ‘మంగళవారం’

Update: 2017-02-15 05:13 GMT
సీఎం కుర్చీలో కూర్చోవాలని తపించిన చిన్నమ్మకు ఇక ఆ ఛాన్స్ దాదాపుగా లేనట్లే. అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్దారణ కావటం.. నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించటంతో.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పదేళ్ల పాటు ఆమెపై నిషేధం పడనుంది. జైలుశిక్ష అనుభవించే మూడున్నరేళ్లు.. తర్వాతి ఆరున్నర సంవత్సరాలు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వీలు లభించదు. సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆశను నెరవేర్చుకునేందుకు చిన్నమ్మ ‘మంగళవారం’ ముహుర్తంగా ఎంపిక చేసుకుంటే.. చివరకు మంగళవారం రోజున.. తన సీఎం కల సాధ్యం కాదని తేలిపోవటం విశేషం.

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ.. సీఎం కుర్చీలో కూర్చోవటానికి వీలుగా గత మంగళవారం ముహుర్తంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే.. అమ్మ స్మారకం ఉన్న మెరీనా బీచ్ కు దగ్గర్లోని మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాల్ ను తన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా ఫిక్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే పనుల్ని ప్రారంభించారు. అయితే.. ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. ప్రమాణస్వీకారోత్సవ పనుల్ని వాయిదా వేశారు.

సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ తహతహలాడింది.. సీఎం కుర్చీలో కూర్చునే ఛాన్స్ ఇప్పటికైతే లేదన్న విషయంపై స్పష్టత వచ్చింది ‘మంగళవారం’ కావటం గమనార్హం. ఈ రెండు పరిణామాలు చూసినప్పుడు.. మంగళవారం చిన్నమ్మకు ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News