తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊహించిన షాక్ తగిలింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించే వరకు గడ్డం తీయనని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గడ్డం తీస్తానంటూ ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఫలితాల్లో టీఆర్ ఎస్ జోరు మొదలైన వెంటనే... ఉత్తమ్ పై సెటైర్లు మొదలయ్యాయి. గడ్డం ఎప్పుడు తీసుకుంటారు.. బ్లేడ్ పంపించాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు మీకు కావాల్సినంత టైం వచ్చింది.. మంచి సెలూన్ చూపించుకుని గడ్డం గీయించుకోండి అంటూ సలహాలు పడేస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సెలూన్ మా ఏరియాలో ఒకటి ఉంది.. మీకు ఫ్రీగా చేస్తాం అంటూ మరికొందరు ఆఫర్స్ ఇస్తున్నారు.. ఇన్నాళ్లూ గడ్డంతో చూసి బోర్ కొడుతుంది.. ఇప్పటికైనా గడ్డం తీసి న్యూ లుక్ లో రండి.. అప్పుడైనా లక్ కలిసి వస్తుందేమో చూద్దాం అంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితాలకు ముందురోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లిరావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. కాగా, తాజాగా ఉత్తమ్ ఓటమి పాలవడం సంచలనంగా మారింది.మొత్తానికి ఉత్తమ్ గడ్డం కథ ముగిసింది అంటున్నారు.