సినిమా దర్శకుడు సతీష్ కౌషిక్ ఐడియా సినిమా పరిశ్రమలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గ్రామాలకు కూడా సినిమాలను తీసుకెళ్లగలిగే అవకాశాన్ని కల్పించింది. గ్రామాల్లో కూడా డిజిటల్ సినిమాలను ప్రదర్శించే అవకాశం కల్పించింది.
సతీష్ కౌషిక్.. మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ (ఎండీఎంటీ) ట్రక్కు ఐడియా ఇప్పుడు విశేష ప్రాచుర్యాన్ని దక్కించుకుంటోంది. ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజ్రీవాల్ సతీష్ కౌషిక్ ఐడియాను అభినందించారు. సతీష్ భారీ ట్రక్కులను ఏర్పాటు చేసి అందులో ప్లాస్టిక్ తో తయారు చేసిన గుడారాలు - భారీ స్క్రీన్ లను పెట్టుకొని దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేలా మొబైల్ థియేటర్ ను తయారు చేశాడు. గ్రామంలోకి వెళ్లగానే ఆ ప్లాస్టిక్ గుడారాలను వేసి అత్యాధునిక స్క్రీన్ ల ద్వారా గ్రామస్థులకు సినిమాలను చూపించనున్నారు. గ్రామస్థులందరూ చూసే విధంగా తక్కువ రేట్ లో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. కేవలం రూ.35 నుంచి రూ.75 రూపాయలు మాత్రమే సినిమా టికెట్ పెట్టడంతో దీన్ని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఉత్తర భారతంలో ప్రస్తుతం ఈ మొబైల్ థియేటర్లు సందడి చేస్తున్నాయి. ఈ ఐడియానే చాలా కొత్తది. ఓ భారీ ట్రక్కులో గుడారాలు - స్క్రీన్లు - థియేటర్ లో ఉండే అన్ని పరికారాలను వేసుకొని వెళతారు. . గ్రామంలోకి వెళ్లి వాటిని అంత జతపరిచి థియేటర్ గా మారుస్తారు. అంతేకాదు ఇది ఫుల్లీ ఎయిర్ కండీషనర్. ఫైర్ ఫ్రూఫ్ మరియు వాటర్ ఫ్రూఫ్ థియేటర్ కావడంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సినిమాను ప్రదర్శించవచ్చు. దాదాపు 150మంది చూడగలిగేలా ఈ మొబైల్ థియేటర్ గుడారాలు ఏర్పాటు చేస్తారు.ప్రస్తుతం ఈ కొత్త ఆలోచనకు ఎంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజ్ అయ్యే సినిమాలకు ఈ మొబైల్ థియేటర్ లు గొప్ప వరంగా మారాయని ఎంటర్ ప్రెన్యూర్ సుశీల్ చౌదరి వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఇలాంటి 35 మొబైల్ ట్రక్ థియేటర్లు రెడీ అయ్యాయని వీటి ద్వారా మొదట బాహుబలి - షెహన్షా - డాన్ అండ్ షెహన్షా సినిమాలు మొదట ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కొత్త ఐడియా ప్రస్తుతం ఉత్తరభారతంలో సంచలనాలు రేపుతోంది. అక్కడి గ్రామీణులకు కొత్త సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.