హైదరాబాదీ బిర్యానీని అవమానించిన చాట్ జీపీటీపై సత్య నాదెళ్ల ఆగ్రహం..!

Update: 2023-01-06 07:26 GMT
హైదరాబాద్ బిర్యానీ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తుంది. ఈ బిర్యానీ వంటకాన్ని టేస్ట్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు పక్క రాష్ట్రాలే కాకుండా విదేశీయులు సైతం ఉవ్విళ్లూరుతుంటారు. హైదరాబాద్ బిర్యానినీ తమ ఫేవరేట్ గా చెప్పుకునేందుకు ఫుడ్ లవర్స్ గర్వంగా ఫీలవుతుంటారు.

ఇంతటి ఖ్యాతి కలిగిన హైదరాబాద్ బిర్యానినీ చాట్ జీపీటీ టిఫిన్ గా మార్చివేయడంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాట్ జీపీటీ హైదరాబాదీ బిర్యానీ సౌత్ ఇండియన్ టిఫిన్ పేర్కొనడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ మేరకు తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో మరోసారి చాటుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ బోట్ సాఫ్ట్‌వేర్ చాట్ జీపీటీతో సత్య నాదెళ్ల ఇటీవల చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాట్ జీపీటీ సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్ ఏంటి? అని అడుగుతూ ఇడ్లీ.. వడ.. దోసెతో పాటు బిర్యానీని చూపించింది.

టిఫిన్ లిస్టులో హైదరాబాద్ బిర్యాని పేరును చాట్ జీపీటీ చూపించడంతో సత్యనాదెళ్ల సీరియస్ అయ్యారు. బిర్యానీని టిఫిన్‌గా పేర్కొనడం హైదరాబాదీ అయిన తనను అవమానించడమేనంటూ ఫైర్ అయ్యారు. బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్‌గా పేర్కొనడం వల్ల ఆ సాఫ్ట్‌వేర్ ఓ హైదరాబాదీకి చెందిన తన తెలివితేటలను అవమానించిదని సత్య నాదెళ్ల అన్నారు.

దీంతో చాట్ జీపిటీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోపాటు సత్య నాదెళ్లకు క్షమాపణలు చెప్పింది. సత్య నాదెళ్ల చెప్పిన మాట వాస్తవమేనని.. సౌత్ ఇండియాలో బిర్యానీని టిఫిన్ డిష్‌గా వర్గీకరించ లేదని చాట్ జీపీటీ పేర్కొంది. ఇటీవల బెంగూళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో భాగంగా చాట్ జీపీటీలో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల అందరితో పంచుకున్నారు.

ఈ సమ్మిట్ సత్య నాదెళ్ల మాట్లాడుతూ టెక్నాలజీ కోసం టెక్నాలజీని వినియోగించడం ముగిసిందన్నారు. టెక్నాలజీ ఉపయోగం గురించి ప్రపంచలోని ప్రతీఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. కాగా చిట్ జీపీటీ సంఘటనతో హైదరాబాద్ లో పుట్టిన సత్య నాదెళ్లకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News