సంచలాత్మకమైన సత్యం కుంభకోణం కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చింది సీబీఐ స్పెషల్ కోర్ట్. అయితే... ఈ తీర్పుపై మెజారిటీ ప్రజలు హర్షం ప్రకటించారు. మరి కొందరు రాజుగారిపై సానుభూతి చూపించారు. ఫైనల్ గా స్పెషల్ కోర్టు మాత్రం రామలింగ రాజు కి బలమైన జైలు శిక్ష, బరువైన జరిమానా విదించిన సంగతి తెలిసిందే!
తాజాగా ఈ సత్యం కేసులో దోషులుగా నిర్దారితమై జైలు శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజు సోమవారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సత్యం కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని వీరిద్దరూ నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. దీనిపై కోర్టు స్పందించాల్సి ఉంది. ఏమాటకు ఆమాట చెప్పుకోవాల్సి వస్తే... మన చట్టాలు బలే సౌకర్యంగా ఉంటాయి కదా అని పలువురు పెదవి విరుస్తున్నారు!