చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే - టీడీపీ నేత తలారి ఆదిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై - జగన్ పై అభిమానం చూపే అధికారులు - సిబ్బంది తనకొద్దని... అలాంటివారెవరైనా ఉంటే తన నియోజకవర్గం నుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు - సర్పంచులు చెప్పే పనులు చేసేవారు మాత్రమే తనకు కావాలని... అలా చేయనివారు తన నియోజకవర్గంలో ఉండొద్దని అన్నారు.
నియోజకవర్గ స్థాయి అధికారులు - ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు - ఇతర ప్రజాప్రతినిధుల తీర్మానం ఉన్నా.. లేకున్నా.. గృహ నిర్మాణం - ఇతర అభివృద్ధి పనులు మెజారిటీ జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో చేయాలని మండల అధికారులను ఆదేశించారు.
సర్పంచిని కారణంగా చూపించి పనులు ఆపేసే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నేతలు చెప్పే పనులను చేసి తీరాలని ఆదేశించారు. అలా ఎవరైనా చేయకుంటే వేరే చోటికి బదిలీపై వెళ్లాలని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/