దేశంలో వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఈ తరుణంలో ఆఫీసులు అన్ని మూతబడటంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐల పై మారటోరియం విధించింది. మార్చి 1 నుంచి మే 31 వరకు మొదటి విడత, జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు రెండో విడత మారటోరియం ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభించింది. ఒకేవేల మొదటి విడత మారటోరియం ఎంచుకోనివారు కూడా రెండో విడతలో మారటోరియం ఎంచుకొని ఈఎంఐలు వాయిదా వేసుకోవచ్చు.
మీరు మారటోరియం కోరుకుంటే ..సంబంధిత బ్యాంకు కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆలా కాకుండా మీ ఈఎంఐలు వాయిదా కట్టాలి అనుకుంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుంది. ఎంఐ వాయిదా వేయాలనుకుంటే మాత్రం బ్యాంకు పంపిన మెసేజ్‌లో ఉన్న నెంబర్‌కు YES అని మెసేజ్ వచ్చిన ఐదు రోజుల్లో ఎస్ఎంఎస్ చేయాలి. ఈఎంఐలు వాయిదా వేస్తే మీ లోన్ ఔట్ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ప్రకారం ..ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు ఈఎంఐ వాయిదా వేసే అవకాశాన్ని కల్పించింది
మరి ఏఏ లోన్లపై మారటోరియం ప్రభావం ఎలా ఉంటుందో ఎస్ బీఐ ఉదాహరణలతో సహా వివరించింది. ఆ ఉదాహరణలు చూడండి.
Auto Loan: ఓ వ్యక్తి రూ.6 లక్షల ఆటో లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 54 నెలలు ఈఎంఐ చెల్లించాలి. మొదట మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి అదనంగా రూ.36,000 వడ్డీ చెల్లించాలి. అంటే 3 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.19,000 వడ్డీ చెల్లించాలి. ఇది 1.5 ఈఎంఐతో సమానం.
Home Loan: ఓ వ్యక్తి రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఇంకా 15 ఏళ్లు ఈఎంఐలు చెల్లించాలి. ఆ వ్యక్తి మొదట మూడు నెలలతో పాటు మరో మూడు నెలలు మారటోరియం ఎంచుకున్నాడు. ఔట్‌స్టాండింగ్‌పై సుమారు రూ.4,54,000 వడ్డీ చెల్లించాలి. ఇది 16 ఈఎంఐలు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడే మొదటిసారి మారటోరియం ఎంచుకుంటున్నట్టైతే సుమారు రూ.2,34,000 వడ్డీ చెల్లించాలి. ఇది 8 ఈఎంఐలతో సమానం. అంటే రెండుసార్లు మారటోరియం ఆప్షన్ ఎంచుకొని 6 ఈఎంఐలు వాయిదా వేస్తే అదనంగా 16 ఈఎంఐలు కట్టాలి. అందుకే మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టం తప్ప లాభం లేదు. ఈఎంఐలు చెల్లించడానికి అస్సలు డబ్బులు లేని పరిస్థితి ఉంటేనే మారటోరియం ఎంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈఎంఐలు చెల్లించడమే మేలు.