కస్టమర్లకు SBI బంపర్ ఆఫర్..రూ.2 లక్షల రుణం..6 నెలలు ఈఎంఐ చెల్లించక్కర్లేదు!

Update: 2020-05-04 06:45 GMT
కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతున్న పేద , మధ్యతరగతి వారికీ దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన శుభవార్త చెప్పింది.  దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ ‌బీఐ తన కస్టమర్లకు ప్రిఅప్రూవ్డ్ లోన్స్  అందిస్తోంది. కరోనా వైరస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి స్టేట్ బ్యాంక్ ఈ ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీని అందరికి  అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు కేవలం 45 నిమిషాల్లో 2 లక్షల రుణం పొందొచ్చు. అంతేకాకుండా రుణంపై 6 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ లోన్స్ కి ఏడాదికి 7.25 శాతం వడ్డీ చెల్లించాలి. మీరు కూడా మీ రుణ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక్క ఎస్ఎంఎస్ పంపి రుణ అర్హత తెలుసుకునే అవకాశం అందుబాటులో ఉంది.

అసలు మీరు ఈ లోన్ తీసుకోవడానికి అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి అంటే ..మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ ఎం ఎస్ చేయాలి. ఆ తరువాత కొద్ది సేపటికే మీరు లోన్ ‌కు అర్హులో కాదో తెలిసి పోతుంది. కేవలం నాలుగు ప్రాసెస్ లలో మీ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఎస్‌బీఐ యోనో యాప్ లో కూడా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ లో అవైల్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేస్తే ..మీ వివరాలు చెక్ చేసి , మీరు లోన్ పొందటానికి అర్హులు అయితే .. లోన్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌ లోకి వచ్చేస్తాయి.
Tags:    

Similar News