అదిరే మాస్కు తయారు చేసిన సంస్థ.. మాస్కు మీద కరోనా పడితే ఖతం!

Update: 2021-04-28 03:56 GMT
కరోనా నుంచి సంరక్షణకు ముఖానికి మాస్కుకు మించిన తారకమంత్రం మరొకటి లేదు. రక్షణ కవచంలా పని చేసే మాస్కుకు మరిన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద కరోనా వైరస్ చేరటం.. పొరపాటున చేతులకు తగిలి.. శరీరంలోకి వెళ్లటం చాలా సందర్భాల్లో జరుగుతోంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా సరికొత్త మాస్కును రూపొందించింది ఛండీగఢ్ కు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్టిట్యూట్ సంస్థ. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యమైంది.

మరో నెలరోజుల్లో సిద్దమయ్యే ఈ టెక్నాలజీ.. కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు మాస్కు రూపంలో సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మాస్క్ ను మల్టీలేయర్ గా తయారు చేయటంతో పాటు.. ఇందులో ప్రత్యేకమైన కెమికల్ ను వినియోగించారు. మాస్కు మీద కరోనా వైరస్ చేరిన వెంటనే.. మాస్కులోని కెమికల్ కారణంగా వెంటనే నాశనమవుతుంది. ఈ మాస్కును 90సార్లు ఉతికి వాడుకునే వీలుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ ఇవ్వటానికి సిద్ధమవుతోంది ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ.

ఏదైనా ఎన్జోవో సంస్థ ముందుకు వచ్చి.. ఈ సాంకేతికతను కోరితే.. తాము ఇస్తామని.. పెద్ద ఎత్తున ఈ తరహా మాస్కుల్ని రూపొందించటం ద్వారా.. కరోనా మహమ్మారి ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు వీలుంది. మరి.. ఈ తరహా మాస్కుల్ని తయారు చేసేందుకు ఏయే సంస్థలు ముందుకు వస్తాయో చూడాలి.
Tags:    

Similar News