అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలత దేశంలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోడీ సర్కార్ కు మీడియా కూడా అంతే ప్రాధాన్యం ఇస్తోంది. మోడీ పడిపోతున్న ప్రతీసారి లేపడానికి ఢిల్లీలోని బీజేపీ అనుకూల మీడియా కాచుకు కూర్చోందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే-కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన సర్వేలో ప్రధాని నరేంద్రమోడీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని తేటతెల్లమైంది. తదుపరి ప్రధానిగా మోడీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా తిరిగి మోడీ కావాలని 66శాతం మంది.. కేవలం 8శాతం మంది మాత్రమే రాహుల్ కావాలని కోరారు. సోనియాకు కేవలం 5శాతం మందే ఓటు వేయడం గమనార్హం.
ఇక దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మొదటిస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్ - 9వ స్థానంలో కేసీఆర్ ఉన్నారు..
అయితే ఈ సర్వే ఫక్తు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో దీనిపై అనుమానాలు దేశ ప్రజల్లో లేకపోలేదు. ఆ సర్వే చాలా దారుణంగా ఉందని మేధావులు కూడా అంటున్నారు. చదువుకున్న వారు ఈ రోజు దేశంలో సర్వేలో పాల్గొనే పరిస్థితి లేదు. ఒకవేళ పాల్గొన్నా కరోనాను మోడీ ఎలా ఎదుర్కొన్నారు అనే ప్రశ్న వస్తే 1శాతం మంది కూడా మోడీకి అనుకూలంగా చెప్పరు. ప్రస్తుతం రోజు వారీ కేసుల్లో ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 స్థానానికి వచ్చేసింది. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. వలస కార్మికులను తీసుకొని పోవడానికి రైల్వే శాఖ డబ్బులు కూడా వసూలు చేసింది.
ప్రస్తుతం కరోనా దెబ్బకు దేశంలో పనిలేదు.. దేశంలో ఉన్న ప్రజలను పనుల కోసం అల్లాడి పోతున్నారు. రాష్ట్రాలకు డబ్బులు సరిగా కేంద్రం ఇవ్వడం లేదు. చైనా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణాలను కేంద్రం దాచిపెడుతోంది. అయోధ్య రామాలయ భూమి పూజ తన సొంత కార్యక్రమం అనుకొని ఎవరిని పిలవకుండా యోగిలను భోగిలను సన్యాసులను పిలిచి తతంగం చేశారు.
2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత మోడీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోందని.. ఏ విధంగా ఇలా సర్వే చేస్తారని.. మోడీకి 66శాతం మద్దతు వచ్చిందంటే నమ్మశక్యంగా లేదని మేధావులు కుండబద్దలు కొడుతున్నారు. ఇక చదువుకున్న వారంతా ఇదంతా ఫేక్ సర్వే అంటున్నారు. ప్రస్తుతం ఇండియా టుడే సర్వేపై అందరూ సోషల్ మీడియాలో ఫేక్ అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఈ సర్వే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది.