ఆ స్కూల్ అతి.. జాతీయ ప‌తాకంపై ఎమ్మెల్యే!

Update: 2018-08-16 05:22 GMT
పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా చోటు చేసుకున్న కొన్ని ప‌రిణామాలు సంచ‌ల‌నంగా మారాయి. అలాంటిదిదే హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలో చోటు చేసుకుంది. రాజ‌కీయ నేత‌ల్ని నిలువెత్తుగా కొలిచే భ‌జ‌న‌ప‌రులు ఎక్కువైన వేళ‌.. ఈ త‌ర‌హా ఉదంతాలు చోటు చేసుకోవ‌టం కామ‌న్.

యాక‌త్ పురాలోని ఒక స్కూల్ యాజ‌మాన్యం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికుల‌కు ఒళ్లు మండేలా చేసింది. అంతేనా.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన స్కూల్ యాజ‌మాన్యంపై కేసు న‌మోద‌య్యేలా చేసింది. ఇంత‌కీఆ స్కూల్ చేసిన త‌ప్పు తెలిస్తే.. మీరు సైతం సీరియ‌స్ కావ‌టం ఖాయం.

యాక‌త్ పురా నియోజ‌క‌వ‌ర్గంలోని ఎస్సార్టీ కాల‌నీలో జ‌వ‌హ‌ర్ హైస్కూల్ పేరిట ఒక పాఠ‌శాల‌ను నిర్వ‌హిస్తున్నారు. పంద్రాగ‌స్టు నేప‌థ్యంలో స్కూల్ యాజ‌మాన్యం స్థానిక మ‌జ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇదేమీ త‌ప్పు కాన‌ప్ప‌టికీ.. ఫ్లెక్సీలో జాతీయ జెండా మీద నుంచి ఎమ్మెల్యే న‌డుస్తున్న‌ట్లుగా  ఉండ‌టం వివాదానికి కార‌ణ‌మైంది. దీనిపై మండిప‌డ్డ స్థానికులు స‌ద‌రు స్కూల్ యాజ‌మాన్యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన పోలీసులు.. హైస్కూల్ య‌జ‌మాని అయూబ్ ఖాన్ పై కేసు న‌మోదు చేశారు. అనంత‌రం స్కూల్ య‌జ‌మానిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మ‌న‌సు దోచుకోవాల‌న్న ప్ర‌య‌త్నం త‌ప్పు కాదు కానీ.. అది అత్యుత్సాహంగా మారి.. మిగిలిన వారి మ‌నోభావాలు దెబ్బ తినేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News