టీజేజీలోనే తల్లులు అవుతున్న వారి గురించి గతేడాది చివరన అమెరికాలో తీవ్రంగా చర్చ నడిచింది. అమెరికా అంటు రోగాల నియంత్రణ సంస్థ లెక్కల ప్రకారంగా 15 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతి వెయ్యి మంది మహిళలలో 2020లో 15 మంది పిల్లలకు జన్మనిచ్చారు. దేశవ్యాప్తంగా చిన్న వయసులోనే తల్లులవుతోన్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ టెక్సాస్‌లో మాత్రం ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది.
చిన్న వయసులోనే పిల్లలకు జన్మనిస్తున్న టాప్ టెన్ రాష్ట్రాల్లో టెక్సాస్ మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే చిన్నతనంలోనే గర్భం దాల్చి మాతృత్వం పొందుతున్న వారికి ప్రత్యేకంగా టెక్సాలోనే ఒక స్కూల్ నడుపుతోంది. ఈ పాఠశాల టీనేజీ తల్లులలకు ఏవిధంగా సహకారం అందిస్తుంది? అక్కడ వీరికి ఏం నేర్పిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ఆ స్కూల్లో చదువుతున్న హెలెన్ మాటల్లో.. 15 ఏళ్ల వయస్సులో హెలెన్ ఎక్కువ తినడం ప్రారంభించింది. తనకు ఎందుకు అంత తినాలిపిస్తుందో అర్థం అయ్యేది కాదు. ఇదే విషయాన్ని తన అక్కతో పంచుకోగా ఒక్కొసారి అవుతుండవచ్చు అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత హెలన్ మనసు నలతగా.. గందగోళంగా ఉందడేది దీని వల్ల తరుచూ కుటుంబ సభ్యులు.. స్నేహితులతో గొడవ పడేది.
ఆ తర్వాత ఆమెకు నెలసరి ఆలస్యమైంది. తన పుట్టిన నాటికి గర్భవతిగా నిర్ధారణ అయింది. ఈ వార్త విని తన స్నేహితులు దూరం పెట్టారు. అబ్బాయిలను ఆమె తన చుట్టూ తిప్పుకునేదనే నిందలు వేశారు. తన బిడ్డకు తండ్రైన తన క్లాస్‌మేట్ కూడా తనతో మాట్లాడటం మానేశాడు. అయితే తాను వారితో పోరాడాలని అనుకోలేదని హెలెన్ తెలిపారు.
నెలలు నిండుతున్న సమయంలోనే తాను స్కూల్ మారాలనుకుంది. టెక్సాస్ లోని బ్రౌన్స్‌విల్‌లోని లింకన్ పార్క్ లో చేరింది. 2005 నుంచి ఈ పాఠశాల టీనేజ్ తల్లులకి సేవలందిస్తోంది. ఈ స్కూల్లోని విద్యార్థులంతా సుమారు 14 నుంచి 19 ఏళ్ల లోపు వారే. వీరిలో ఎక్కువ మంది లాటిన్లే. చాలామంది అరొకొర సంపాదనే.
తన పాపను తీసుకొని కూడా స్కూల్‌కి వెళ్లొచ్చనే కారణంతో హెలెన్ లింకన్ పార్క్ స్కూల్‌లో చేరినట్టు వెల్లడించింది. ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా గర్భం దాల్చిన వారు ఈ పాఠశాలలో చేరడం.. కొందరు బిడ్డ పుట్టిన తర్వాత తమ మునపటి స్కూళ్లకు వెళ్లిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
లింకన్ పార్క్ పాఠశాలలోనూ ఇతర పాఠశాలలో మాదిరిగానే స్కూల్ సిలబస్ ఉంటుంది. విద్యార్థులంతా తమ క్లాసులు ఉత్తీర్ణులయ్యేలా పాఠశాల యాజమాన్యం సహకరిస్తుంది. విద్యార్థులను తీసుకెళ్లి.. తీసుకొచ్చే బస్సుల్లో పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా సీట్ల సదుపాయం ఉంది. ఉదయం పూట విద్యార్థినీల కోసం.. వారి పిల్లల కోసం అల్పాహారం తీసుకొస్తుంటారు.
వీరి పిల్లలు పాఠశాలలోని డేకేర్ సెంటర్‌లో ఉచితంగా చదువుకోవచ్చు. ఎలాంటి ఫీజుల బెడద కూడా ఉండదు. తమ పిల్లలు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆస్పత్రిలో చూపించేందుకు టీనేజ్ తల్లులకు ప్రత్యేకంగా అనుమతి కూడా ఇస్తారు. తల్లులకు అవసరమైనప్పుడు పిల్లల వస్త్రాలను అందించడానికి క్లాస్‌రూమ్‌లోనే పెద్ద వార్డ్‌రోబ్ ఉంది.
టెక్సాస్ లో చాలా కఠినంగా అబార్షన్ చట్టాలను అమలు చేయడం.. పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కాకపోవడంతోనే ఆ ప్రాంతంలో అత్యధికంగా టీనేజ్ లో తల్లులవుతున్నారని లింకన్ పార్క్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సింథియా కార్డెనాస్ తెలిపారు. బాలికలతో ఈ సమాచారం పంచుకోకపోతే.. వారికి దీనిపై అవగాహన రాదన్నారు.
విద్యార్థులు కాలేజీకి వెళ్లేలా ప్రోత్సహించడమేనని తమ ఆ స్కూల్ లక్ష్యమని ఆమె తెలిపారు. టీనేజ్ తల్లుల్ని విజయవంతుల్ని చేసి, వారి పిల్లలకి కూడా బంగారు భవిష్యత్ కల్పించేందుకు తాము సహకరిస్తున్నట్లు చెప్పారు. తల్లులు పిల్లలతో ఎలా మెలగాలి? తల్లిగా ఎలాంటి పాత్ర పోషించాలి వంటి విషయాల్లో సలహాలు ఇస్తామని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.