సూప‌ర్ స్టార్ కుటుంబానికి ఊహించ‌ని షాక్‌

Update: 2017-08-16 19:02 GMT
రాజ‌కీయ అరంగేట్రం కోసం సర్వం సిద్ధం చేసుకున్న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు అనూహ్య‌మైన ఎదురుదెబ్బ త‌గిలింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల కార‌ణంగా ర‌జనీ ఇబ్బందుల్లో ప‌డ్డారు. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో ఆర్థిక అంశాల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చిన ర‌జ‌నీ స‌తీమ‌ణి ల‌త మ‌ళ్లీ  అదే రీతిలో వార్త‌ల్లోకి వ‌చ్చారు. ర‌జ‌నీ స‌తీమ‌ణి ల‌త నేతృత్వంలో చెన్నైలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అద్దె చెల్లించ‌క‌పోవ‌డంతో భ‌వ‌నం య‌జ‌మాని తాళం వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భ‌వ‌నం య‌జ‌మాని వెంక‌టేశ్వ‌ర్లు వాద‌న ప్ర‌కారం ర‌జ‌నీ స‌తీమ‌ణి సార‌థ్యంలోని స్కూలుకు ఈ భ‌వానాన్ని 2002లో అద్దెకు ఇవ్వ‌గా 2013 స‌మయంలో అద్దె స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. అయితే అద్దె చెల్లింపులో స‌మ‌స్య‌లు ఉన్నందున భ‌వ‌నం ఖాళీ చేయించాల‌ని కోరిన‌ప్ప‌టికీ విన‌క‌పోవ‌డంతో కోర్టును కూడా ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. చ‌ర్చ‌ల అనంతరం మొత్తం ప‌ది కోట్ల రూపాయ‌ల బ‌కాయి నుంచి 2 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకొన్నార‌ని అయితే అనంత‌రం మిగ‌తా బ‌కాయిల చెల్లింపు విష‌యంలో తీవ్ర జాప్యం చేస్తున్నార‌ని భ‌వ‌నం య‌జ‌మాని వ్యాఖ్యానించారు. అయితే త‌దుప‌రి ర‌జ‌నీ స‌తీమ‌ణి నుంచి ఎలాంటి డ‌బ్బులు త‌మ‌కు అంద‌క‌పోవ‌డంతోనే తాళం వేయాల్సి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా, ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చ‌దువుతున్న 300మంది విద్యార్థులను వెలచెరిలోని ఈ స్కూలు అనుబంధ సంస్థలోకి  తరలించారు.
Tags:    

Similar News