భారీ గ్రహశకలం.. భూమి సేఫ్.. ఫొటో తీసిన నాసా

Update: 2019-09-17 09:38 GMT
అది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. భూమిపై డైనోసార్లు ఉన్న కాలం.. కానీ ఒకే ఒక్క భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. వేల అణుబాంబుల శక్తిని విడుదల చేసింది.  అంతే సమస్త డైనోసార్లు చనిపోయి అంతర్థానమైపోయాయి.. ఆ గ్రహశకలం ఢీకొని ఉండకపోతే భూమిపై ఇప్పటికీ డైనోసార్లు ఉండి ఉండేవి.

అయితే ఇప్పుడు నాడు భూమిని ఢీకొన్న గ్రహశకలానికి దాదాపు 5 రెట్లు పెద్దది అయిన ‘2000 క్యూడబ్యూ 7’అనే పేరుగల భారీ బాహుబలి గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి వచ్చింది. నాసా దాని ఫొటోలు రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది.

2000 క్యూడబ్యూ 7.. భూమికి దగ్గరగా ప్రయాణించిన భారీ గ్రహశకలం పేరు. భూమి పక్కనుంచే దాదాపు 3.30 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లిన ఈ భారీ గ్రహశకలం ఢీకొని ఉంటే భూమిపై పెను వినాశనమే జరిగి ఉండేది. కానీ తృటిలో ఇది భూమిని ఢీకొనకకుండా అత్యంత సమీపం నుంచి దాదాపు గంటకు 14400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు నాసా ప్రకటించింది. అంతేకాదు.. గ్రహశకలం ఫొటోలు తీసి కూడా విడుదల చేసింది.. కెనాడా దేశంలో ఉన్న నాసాకు చెందిన సోలార్ సిస్టమ్ టెలిస్కోప్ ద్వారా ఈ ఫొటోలను నాసా తీసింది. అంతరిక్షంలో శబ్ధం ప్రయాణించదు. అందుకే అది మన పక్కనుంచి వెళ్లినా దాని స్పీడుకు మనకు సౌండ్ వినిపించలేదు.

అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ గ్రహశకలం భూమి పక్కగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ గ్రహశకలం మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. 2038 వరకు ఇదే భూగోళం వైపు రావచ్చని ప్రఖ్యాత ఖగోళా శాస్త్రవేత్త పాల్ కాక్స్ తెలిపారు. మరో వందేళ్లకైనా ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందన్నారు. ఇదే గనుక భూమిని ఢీకొడితే వందల అణుబాంబుల శక్తితో భూమియే అంతమైపోతుందని .. మాటల్లో ఆ నష్టాన్ని అంచనావేయలేమని శాస్త్రవేత్త తెలిపారు.


Tags:    

Similar News